Kaala Bhairava Trolls : తారక్, చరణ్ పేర్లను మరిచిన సింగర్.. నెటిజన్ల ఆగ్రహం.. దెబ్బకు దిగొచ్చిన కాళ భైరవ
Kaala Bhairava Trolls కాళ భైరవ తన నాటు నాటు పర్ఫామెన్స్, ఆస్కార్ వేదికపై పాట పాడటం వంటి వాటిపై ఎమోషనల్ అయ్యాడు. తనకు అవకాశం ఇచ్చిన వారందరికీ థాంక్స్ చెప్పాడు. అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లను మరిచిపోయాడు.
Kaala Bhairava Trolls సోషల్ మీడియాలో అసలే నందమూరి అభిమానులు, మెగా ఫ్యాన్స్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం నడుస్తోంది. ఆస్కార్ అవార్డుల్లో క్రెడిట్ మా వాడికే ఉంటుంది అని ఇరు హీరోల అభిమానులు కొట్టేసుకుంటున్నారు. ఇలా ఉంటే.. కాళ భైరవ వేసిన పోస్ట్ ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌కు మండిపోయేలా చేసింది. ఆస్కార్ వేదికపై మన తెలుగు పాటను ఇలా పాడటం ఆనందంగా ఉందని చెబుతూ దానికి కారణమైన వారందికీ థాంక్స్ చెప్పాడు.
ఈ క్రమంలో రాజమౌళి బాబా, నాన్నా, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, కార్తికేయ అన్నా, అమ్మ, పెద్దమ్మల హార్డ్ వర్క్ వల్లే ఈ పాట గ్లోబల్‌గా రీచ్ అయింది.. ఇంత రెస్పాన్స్ వచ్చింది.. అందరూ డ్యాన్స్ వేస్తున్నారు.. డైలాన్, జోష్ వారి టీం వల్లే ఇదంతా సాధ్యమైంది. వారంతా లేకపోతే నాకు ఈ అవకాశమే వచ్చేది కాదు. ఇది వంద శాతం వారి కష్టం వల్లే సాధ్యమైంది. కానీ నాకు ఇందులో క్రెడిట్ ఇచ్చినందుకు థాంక్స్. ఆర్ఆర్ఆర్‌లో పార్ట్ అయినందుకు ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చాడు.
అంతా బాగానే ఉంది కానీ ఈ క్రెడిట్ విషయంలో అస్సలు ఎన్టీఆర్, చరణ్ పేర్లను ఎక్కడా చెప్పలేదు కాళ భైరవ. దీంతో జనాలు మండి పడ్డారు. అంటే ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిందేమీ లేదని అంటావ్ అంతేగా? అని జనాలు విరుచుకుపడ్డారు. దీంతో తన తప్పు తెలుసుకున్న కాళ భైరవ మళ్లీ ఓ ట్వీట్ వేశాడు. తన తప్పుని సరి చేసుకున్నాడు.
ఆర్ఆర్ఆర్ అయినా నాటు నాటు అయినా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి తారక్ అన్నా, చరణ్ అన్నా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. స్టేజ్ మీద పర్ఫామెన్స్ చేసేందుకు నాకు సాయం చేసిన వాళ్ల గురించి మాత్రమే చెప్పాను.. కానీ అది తప్పుగా చెప్పాను.. అలా తప్పుగా కన్వే చేసినందుకు నన్ను క్షమించండిని వేడుకున్నాడు.
Also Read: Shruti Haasan : నెటిజన్ల తిక్క ప్రశ్నలు.. శ్రుతి హాసన్ సమాధానాలివే.. ఛీ ఛీ ఇదేం దరిద్రం!
Also Read: Nidhhi Agerwal : జోరు పెంచేసిన నిధి అగర్వాల్.. అదరహో అనాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook