Kaala Ratri OTT Streaming: ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసిన సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్ మూవీ ‘కాళరాత్రి’..
Kaala Ratri OTT Streaming: హార్రర్ చిత్రాలకు ఎపుడు టైమ్ లిమిటెడ్ ఉండదు. ఎపుడు ఏ భాషలో మంచి స్క్రిప్ట్ తో తెరకెక్కే హార్రర్ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ఈ కోవలో తెరకెక్కిన చిత్రం ‘కాళరాత్రి’. మలయాళంలో హిట్టైన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసారు. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
Kaala Ratri OTT Streaming: బాబు రాజ్, బిను పప్పు, చేంబన్ వినోద్, గణపతి లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన సినిమా ‘కాళ రాత్రి’. ఈ సినిమాను హనుమాన్ మీడియా బ్యానర్ పై బాలు చరణ్ నిర్మించారు. మర్ఫీ దేవసి డైరెక్ట్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందిన కాళరాత్రి సినిమా ఈ రోజు నుంచి ప్రముఖ ఓటీటీ ఆహా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. "కాళరాత్రి" సినిమా విషయానికొస్తే.. 266 ఎకరాలను అతి తక్కువ ధరకు కొనేందుకు వెళ్లిన స్నేహితుల బృందం ఆ తోటలో ఉన్న గెస్ట్ హౌస్ చూసి ఆశ్యర్యానకి గురవుతారు. ఎంతో అందంగా ఉన్న ఆ గెస్ట్ హౌస్ లో పార్టీ చేసుకుంటారు.
ఈ క్రమంలో ఆ భవనంలో అనూహ్య ఘటనలు జరుగుతుంటాయి. అందులో కొందరు చనిపోతారు. ఆ హత్యలకు కారణం ఎవరన్నది అంతు చిక్కదు. ఇలాంటి ఆసక్తికర మలుపులతో ఉన్న ఈ సినిమా థియేట్రికల్ గా మంచి రెస్పాన్స్ వచ్చింది. వీళ్లు ఎందుకు చనిపోతున్నారు. ఎలా చనిపోతున్నారు తెలియాలంటేఓటీటీలో ఈ మూవీ చూడాల్సిందే. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు కాళరాత్రి సినిమా బాగా నచ్చుతుంది.
నటీనటులు - బాబు రాజ్, చేంబన్ వినోద్, బిను పప్పు, గణపతి, తదితరులు నటించారు. టెక్నికల్ టీమ్ విషయానికొస్తే.. బ్యానర్ - హనుమాన్ మీడియా, నిర్మాత బాలు చరణ్, రచన, దర్శకత్వం - మర్ఫీ దేవ, గతంలో కూడా ఆహా ఓటీటీలో పలు ఇతర భాషల్లో హిట్టైన బ్లాక్ బస్టర్ హార్రర్ మూవీస్ ను స్ట్రీమింగ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈ ఓటీటీలో ఎన్నో హార్రర్ చిత్రాలున్నాయి. వాటికి ఆహాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా స్ట్రీమింగ్ కు వచ్చేసిన ‘కాళ రాత్రి’ సినిమా కూడా ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter