Kajal in Indian2: స్టార్ హీరోయిన్గా తెలుగులో కొనసాగుతున్న సమయంలోనే పెళ్లి చేసుకుని..ఒక బాబుకి .. అందరినీ షాక్ కి గురి చేసింది కాజల్ అగర్వాల్. అందుకోసం మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్న ఈ హీరోయిన్ ఈ మధ్యనే బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో.. మరో విజయం అందుకుంది. అయితే మధ్యలో కొన్ని అనుకోని పరిస్థితులను కూడా ఈ హీరోయిన్ ఎదుర్కొంది. ముఖ్యంగా చిరంజీవి ఆచార్య సినిమాలో నటించిన కాజల్ కి అప్పట్లో ఒక పెద్ద షాక్ ఎదురయింది. 
అదేమిటంటే ఆ సినిమా నుంచి కాజల్ పాత్రని మొత్తం తీసేసారు. దీంతో ఆచార్య సినిమాలో కాజల్ కనిపించకపోవడంతో ఆమె అభిమానులు తెగ నిరాశపడ్డారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తను ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలో శంకర్ దర్శకత్వంలో.. కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఇండియన్ 2 సినిమా కోసం ఎంతో కష్టపడింది ఈ హీరోయిన్. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా ఆచార్య పరిస్థితి ఎదురు కానుంది. కానీ ఈ చిత్రంలోని విశేషం ఏమిటి అంటే కాజల్ పాత్రను తీసేయలేదు కానీ.. ప్రస్తుతం మాత్రం ఇండియన్ 2 సినిమాలో కాజల్ కనిపించదట.


అసలు విషయానికి వస్తే జూలై 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుగులో భార‌తీయుడు 2 పేరుతో ఈ తమిళ చిత్రం విడుద‌ల కానుంది. ఇక సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఈ క్రమంలో ఈ మధ్యనే  ఈ సినిమా ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు సినిమా యూనిట్.  ఈ ఈవెంట్‌కు కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా హాజ‌రైంది. అయితే ఈ ఆడియో లాంచ్ ఈవెంట్లో దర్శకుడు శంకర్ మాట్లాడుతూ..  కాజ‌ల్ అభిమానుల‌కు పెద్ద షాక్ ఇచ్చాడు. 


‘ఈ సినిమాలో కాజల్ కనిపించదు. కాజల్ భార‌తీయుడు 3లో కనిపిస్తుంది’ అని వెల్ల‌డించాడు. దీంతో ఈ చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తున్న కాజల్ అభిమానులకు పెద్ద షాక్ ఎదురైంది.రెండ‌వ భాగానికి చాలా స‌మయం తీసుకున్నార‌ని, మ‌రీ మూడో భాగం ఎప్పుడు విడుద‌ల అవుతుందోన‌ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాజల్ అభిమానులు.


Also Read: Bakrid Holiday: ప్రజలకు శుభవార్త..  2 రోజులు సెలవులు ప్రకటించిన తెలంగాణ.. ఎందుకంటే..?


Also Read: Exit Polls KCR: గెలిచినా.. ఓడినా తెలంగాణ రక్షణ కవచం బీఆర్‌ఎస్‌ పార్టీ



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter