Kalki 2898 AD 1st Day Box Collections: అవువు కొన్ని సార్లు కటౌట్ చూస్తే నమ్మాయాలి డ్యూడ్ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్..ఆయనకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఎన్నో అంచనాల మధ్య రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ ఈ రోజు అర్ధరాత్రి నుంచే చాలా చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. అటు యూఎస్ సహా ఓవర్సీస్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే అక్కడ ప్రీమియర్స్.. మొదటి రోజు కలుపుకుంటే దాదాపు $5 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసినా.. ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో ప్రభాస్.. భైరవగా.. కథకు కీలకమైన మరో పాత్రలో యాక్ట్ చేసాడు. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా ప్రభాస్ తో సరిసమానమైన పాత్ర దక్కడం విశేషం. అంతేకాదు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూడు చిత్రాల్లో విజయ్ దేవరకొండ యాక్ట్ చేయడం విశేషం. మరోవైపు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామా పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. ఇంకోవైపు  సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ నటన మరో హైలెట్.


ఇదీ చదవండి: ‘కల్కి 2898 AD’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్..


ఇక కల్కి సినిమాలో 6 వేల ప్రయాణాన్ని చూపించారు. ఈ సినిమా టాక్ ను బట్టి ఈ చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 230 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తెలుగు స్టేట్స్ లో దాదాపు రూ. 70 కోట్ల నుంచి రూ. 80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఓవర్సీస్ లో దాదాపు రూ. 90 కోట్ల వరకు వచ్చే అవకాశాలున్నట్టు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మొత్తంగా రెస్ట్ ఆఫ్ భారత్, హిందీ కలిసితే ఈ సినిమా తొలి రోజు ఈ సినిమా పలు రికార్డులను బ్రేక్  చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తంగా కల్కి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.


ఇదీ చదవండి: మన దేశంలో వారాహీ అమ్మవారు దేవాలయాలు ఎక్కడున్నాయి.. వాటి ప్రత్యేకతలు ఏమిటంటే.. !



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.