Kalki 2898 Review: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణే, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, అన్నాబెన్ తదితరులు..
ఎడిటింగ్: కోటిగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ: జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్
నిర్మాత: చలసాని అశ్వనీదత్
బ్యానర్: వైజయంతీ మూవీస్
దర్శకత్వం: నాగ్ అశ్విన్
మహానటి వంటి క్లాస్ సబ్జెక్ట్ తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్.. ప్రభాస్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే.. సమ్ థింగ్ డిఫరెంట్ మూవీ ఏదో రాబోతున్నట్టు అపుడే హింట్ ఇచ్చాడు. అంతేకాదు ప్రభాస్ తో ఢిఫరెంట్ మూవీ ప్లాన్ చేసాడు అదే ‘కల్కి 2898 AD’. ముందుగా ప్రాజెక్ట్ K పేరుతో ప్రారంభమైన ఈ మూవీకి ఆ తర్వాత ‘కల్కి 2898 AD’టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ..
ఈ సినిమాను మహా భారత యుద్ధం జరిగినప్పటి నుంచి 6 వేల యేళ్ల ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపెట్టాడు దర్శకుడు. భవిష్యత్తులో ప్రపంచ మంత ఏ వనరులు లేకుండా నిర్జీవమై ఉంటుంది. ఒక్క కాశీ పట్టణం మాత్రమే మిగిలి ఉంటుంది. అయితే అక్కడ సుప్రీం యాస్కిన్ (కమల్ హాసన్) భూమి మీద ఉన్న వనరులను దోచేసి కాంప్లెక్స్ అనే కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటాడు. అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. అయితే అక్కడే భూమి మీద ఉన్న వాళ్లు సరైన తిండి దొరక్క ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. ఈ క్రమంలో అక్కడే ఉండే భైరవ (ప్రభాస్) ఎలాగో అలా కాంప్లెక్స్ వెళ్లి సుఖంగా బతుకుతామనుకుంటాడు. ఈ క్రమంలో 6 వేల యేళ్ల తర్వాత అంతరిక్షంలో ఏర్పడే గ్రహ కూటమిలో ‘కల్’ కిపుట్టబోతున్నాడని యాస్కిన్ మనుషులకు తెలుస్తుంది. అయితే ఆ కల్కి సుమతి (దీపికా పదుకొణే) గర్భంలో ఉన్నాడని తెలుసుకొని ఆమెను చంపాలనుకుంటారు. ఈ క్రమంలో కాశీలో తపస్సు చేసుకుంటూ ఉండే అశ్వత్థమా (అమితాబ్ బచ్చన్) ఆమెను కాపాడానికి వస్తాడు. మరోవైపు అశ్వత్థామ నుంచి సుమతి ఎలాగైనా తీసుకెళ్లి యాస్కిన్ మనుషులకు అప్పగించాలనకుంటాడు భైరవ. ఈ క్రమంలో చోటు చేసుకునే పరిణామాలు ఏమిటి ? ఇంతకీ సుమతి ఎవరు ? ఆమె గర్బంలో ఉన్నది కల్కి భగవానుడేనా.. ?మరోవైపు యాస్కిన్ తిరుగుబాటు చేసే శంబల ప్రజలు. అసలు శంబల ప్రజలు ఎందుకు యాస్కిన్ పై పగతో రగిలిపోతుంటారు. ఇక కాంప్లెక్స్ నుంచి తప్పించుకున్న సుమతి శంబల గ్రామం ఎలా వచ్చింది. అసలు భైరవకు, అశ్వత్థామకు ఉన్న సంబంధం ఏమిటన్నది తెలియాలంటే ‘కల్కి 2898 AD’ మూవీ చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు నాగ్ అశ్విన్ రెండే రెండు సినిమాల ఎక్స్ పీరియన్స్ ను నమ్మి ప్రభాస్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవడం నిజంగా హాట్సాఫ్ చెప్పాల్సిందే. అంతేకాదు తెలుగు ప్రేక్షకులు రొటీన్ మాస్, మసాలా వంటి సినిమాలు చూసి చూసి బోర్ కొట్టింది. వాళ్లకు కల్కి మూవీతో నిజంగానే కొత్త లోకంలోకి తీసుకెళ్లాడు నాగ్ అశ్విన్. రాబోయే 2898 లో ప్రపంచం ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఊహంచుకొని గ్రాఫిక్స్ రూపంలో ప్రేక్షకుల ముందు వుంచడం మాములు విషయం కాదు. అందులో నాగ్ అశ్విన్ టాలెంట్ మెచ్చుకోవాల్సిందే. అంతేకాదు మనం కూడా హాలీవుడ్ వాళ్లకు ఏమి తక్కువ కాదన్నట్టు ఈ సినిమాలో విజువల్స్ చూస్తే తెలుస్తుంది. మొత్తంగా తాను ఊహించుకున్న కొత్త ప్రపంచంతో పాటు అందులో పాత్రలు.. వారు వేసుకునే దుస్తులు..వాడే వెహికల్స్.. వెపన్స్ అన్ని కొత్తగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇప్పటికే మనం ఆదిత్య 369 సహా కొన్ని హాలీవుడ్ సినిమాల్లో చూసాము. ఇపుడు ‘కల్కి 2898 AD’ మూవీతో ప్రేక్షకులకు సరికొత్త లోకంలోకి తీసుకెళ్లాడు. మొత్తంగా మన ఇతిహాసలకు సైన్స్ ఫిక్షన్ జోడించి తెరకెక్కించాడు. మొత్తంగా ఈ సినిమాలో కల్కి పాత్ర ప్రవేశించకుండానే సినిమా మొత్తాన్ని నడిపించడం మరో ఎత్తు అని చెప్పాలి.
ముఖ్యంగా భారత్ సహా పలు దేశాలను అప్పట్లో ఇంగ్లాండ్ ఎలా గుప్పిట్లో పెట్టుకొని మన దేశ వనరులను దోచుకుందో.. అలా యాస్కిన్ సుప్రీం.. కాంప్లెక్స్ అనే కొత్త ప్రపంచంతో భూమిపై ఉన్న అన్న వనరులను దోచుకొని కాంప్లెక్స్ లో కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయడం వంటివి ప్రేక్షకులకు సరికొత్తగా అనిపిస్తుంది. మరోవైపు మన పురాణాల్లో కాశీ ప్రపంచంలోనే తొలి పట్టణం అని పేరు. కానీ ఇందులో కలి యుగంలో చివరి పట్టణం అంటూ చూపించాడు. ఇక శ్రీ మహా విష్ణువు దశావతారాల్లో ఒకటైన కల్కి .. కలియుగం నాల్గో పాదంలో శంబల గ్రామంలో పుట్టినట్టు భవిష్య పురాణం, భవిష్యోత్తర పురాణంలో ఉంది. అందుకే ఈ సినిమాలో కల్కి దేవుడు పుట్టిన శంబల ను తీసుకున్నట్టు చెప్పాడు. అంతేకాదు సినిమా విడుదలకు ప్రమోషన్స్ లో భాగంగా కథను ప్రేక్షకులకు చెప్పి.. ముందుగానే ప్రిపేర్ చేసాడు. ఈ సినిమాలో మెచ్చుకోవాల్సింది గ్రాఫిక్స్ వర్క్. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పదును పెడితే బాగుండేది.
సంతోష్ నారాయణన్ అందించిన పాటలు సోసోగా ఉన్నా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఫోటోగ్రఫీ అత్యున్నత ప్రమాణాలతో ఉంది. వైజయంతి మూవీస్ తన బ్యానర్ వాల్యూకు తగ్గట్టు ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించింది. ఇక ఈ సినిమాలో పాత్రల కోసం నాగ్ అశ్విన్ సెలెక్షన్ కూడా సూపర్ అని చెప్పాలి.
నటీనటుల విషయానికొస్తే..
భైరవగా ప్రభాస్ కటౌట్ ఈ సినిమాకు ప్లస్. ఈ సినిమాలో తన పాత్రకు న్యాయం చేసాడు. ఇక ఈ సినిమాలో అశ్వత్థామ పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ను ఎందుకు ఏరికోరి తీసుకున్నాడో ఈ సినిమా చూస్తే అర్థమవుతోంది. ఆయన తప్పించి మరో నటుడిని అందులో ఊహించుకోలేము. తన పాత్రకు 100కు 200 శాతం న్యాయం చేసారు బిగ్ బీ. ఇక యాస్కిన్ సుప్రీమ్ గా నటించిన కమల్ హాసన్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఈ సినిమాలో కాసేపు కనిపించినా.. తనదైన నటనతో మెప్పించాడు. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొణే పాత్ర చుట్టే సినిమా మొత్తం తిరుగుతోంది. ఆమె కూడా తన క్యారెక్టర్ కు న్యాయం చేసింది. దిశా పటానీ పాత్ర ఈ సినిమాలో కూరలో కరివేపాకు టైపు అని చెప్పాలి. పెద్దగా ఇంపార్టెంట్ లేదు. ఒక సీన్ లో హీరోను కాంప్లెక్స్ లోకి తీసుకెళ్లడంలో సహాయం చేస్తోంది. మిగిలిన పాత్రల్లో నటించిన రాజేంద్ర ప్రసాద్, పశుపతి, దుల్కర్ సల్మాన్ పాత్రలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్పెషల్ అప్పీరియన్స్ ఈ సినిమా మొత్తానికే హైలెట్ అని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
కథ, కథనం, దర్శకత్వం
గ్రాఫిక్స్
మైనస్ పాయింట్స్
సినిమా నిడివి
ఎడిటింగ్
చివరి మాట: ‘కల్కి’.. ఆకట్టుకునే నాగ్ అశ్విన్ సినిమాటిక్ యూనివర్స్..
రేటింగ్: 3.5/5
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి