Kalki 2898 AD Hindi Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరో మైల్ స్టోన్ అందుకున్న ప్రభాస్ ‘కల్కి 2898 AD’..
Kalki 2898 AD Hindi Collections: ‘కల్కి’ మూవీ ప్రభంజనం ఇప్పట్లో ఆగడం లేదు. కేవలం కల్కి మేనియా తెలుగు చిత్ర సీమకే పరిమితం కాలేదు. హిందీ బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా బీ టౌన్ బాక్సాఫీస్ దగ్గర మరో మైల్ స్టోన్ అందుకుంది.
Kalki 2898 AD Hindi Collections: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సిరీస్ తో ప్రభాస్ క్రేజ్ ఆకాశమంత పెరిగింది. ఈ రెండు సినిమాలతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ తర్వాత ప్రభాస్ నటించిన సాహో ఓ మోస్తరు విజయం సాధించింది. ఇక ‘రాధే శ్యామ్’ పరాజయం తర్వాత ప్రభాస్ పని అయిపోయిందని.. కేవలం బాహుబలితోనే రెబల్ స్టార్.. స్టార్ డమ్ అయిపోయిందనే కామెంట్స్ వినబడ్డాయి. కానీ లాస్ట్ ఇయర్ ఆదిపురుష్, సలార్ సినిమాలతో హిందీ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఏంటో చూపించాడు. ఆదిపురుష్ సినిమాకు సరైన టాక్ లేకపోయినా.. డీసెంట్ వసూళ్లనే రాబట్టింది.
ఇక 2023 ఇయర్ ఎండింగ్ లో సలార్ మూవీతో రెబల్ స్టార్ హీరోగా తన స్టామినా ఏంటో చూపించాడు. ఈ సినిమా హిందీలో కూడా దాదాపు షారుఖ్ ‘డంకీ’ గట్టి పోటీ ఇచ్చినా.. అక్కడ ఈ సినిమా రూ. 120 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. తాజాగా కల్కి సినిమా హిందీ బెల్ట్ లో ఫస్ట్ డే నుంచి మంచి జోరు చూపిస్తోంది.
నిన్నటితో వారం రోజు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటి వరకు మన దేశంలో హిందీ వెర్షన్ లో రూ. 153.15 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి రూ. 200 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. మొత్తంగా ఈ వీకెండ్ వరకు ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్ల మార్క్ దాటి.. రూ. 300 కోట్ల వరకు వసూళు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా హిందీలో బాహుబలి, బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్ తర్వాత రూ. 100 కోట్లకు పైగా నెట్ వసూళ్లన సాధించిన ఆరో సినిమాగా ‘కల్కి 2898 ఏడి’ మూవీ రికార్డు క్రియేట్ చేసింది. ఇక రూ. 150 కోట్ల నెట్ వసూళ్ల పరంగా ప్రభాస్ కు నాల్కో చిత్రం. బాలీవుడ్ లో ఒక సౌత్ స్టార్ హీరో ఆరు వంద కోట్ల నెట్ వసూళ్లు సాధించిన హీరో మరెవరు లేరు. ఒక రకంగా భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఒకే ఒక్కడిగా ప్రభాస్ సత్తా చూపెడుతున్నాడు.
Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి