Kalki: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్యపాత్రల్లో దీపికా పదుకొణే, దిశా పటానీ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఈ యేడాది అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు తొలి రోజు దాదాపు రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం రేపింది. బాహుబలి సినిమా తర్వాత వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ‘కల్కి’ మూవీ రికార్డులను నెలకొల్పింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1300 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం రేపుతోంది. తాజాగా ఈ సినిమా షారుఖ్ హీరోగా నటించిన ‘జవాన్’ మూవీ రికార్డును బద్దలు కొట్టినట్టు సమాచారం. జవాన్ మన దేశంలో రూ. 760 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తాజాగా ‘కల్కి’ మూవీ మన దేశంలో జవాన్ మూవీ రికార్డులను బద్దలు కొట్టడం విశేషం. భారత దేశంలో దాదాపు అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా రూ. 760 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్టు సమాచారం. అంతేకాదు మన దేశంలో ‘బాహుబలి 2’, కేజీఎఫ్ 2 ‘ఆర్ఆర్ఆర్,  తర్వాత మన దేశంలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ప్రభాస్ ‘కల్కి 2998 AD’ మూవీ రికార్డు క్రియేట్ చేసింది.


అంతేకాదు ఈ సినిమా 40వ రోజు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టింది. అంతేకాదు రీసెంట్ గా ఈ సినిమా టికెట్ ధరలను రూ. 100 కు తగ్గించారు. దీంతో ముందుగా ఈ సినిమాను చూడలేని  ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా బుక్ మై షోలో 10 వేలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయి. అటు మంగళవారం కూడా ఈ సినిమా బుక్ మై షోలో దాదాపు 8 వేల టికెట్స్ అమ్ముడు పోయినట్టు బుక్ మై షో తెలిపింది. ఈ వారం కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాల సందడి లేకపోవడంతో ఆగష్టు 15 వరకు బాక్సాఫీస్ దగ్గర ‘కల్కి’ జోరు కొనసాగనుంది.ప్రభాస్ విషయానికొస్తే.. తాజాగా ఈయన కేరళ వరద బాధితులకు రూ. 2 కోట్ల విరాళం ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు.


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter