Kalki 2898 AD Movie Review: ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ఉద్దండ నటులు నటించిన చిత్రం ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న 7వ ప్యాన్ భారత్ చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 9 వేలకు పైగా స్క్రీన్స్ లో విడుదల కాబోతుంది. ఇది 10 వేలకు చేరువయ్యే అవకాశాలున్నాయి. తెలుగు లో 1600 పైగా స్కీన్స్ లో విడుదల కాబోతుంది. హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం మొత్తం 4 వేలకు పైగా  స్క్రీన్స్ లో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక విదేశాల్లో దాదాపు 4500 పైగా థియేటర్స్ లో ‘కల్కి 2898 AD’మూవీ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమా దాదాపు $3 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. దేశ వ్యాప్తంగా ఈ సినిమా బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. అంతేకాదు అమితాబ్ బచ్చన్, మనం, సైరా నరసింహారెడ్డిల తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో ఆయన మేకప్ కోసం 3 గంటలు.. తీయడానికి మరో 2 గంటలు పట్టింది. దాదాపు 80 యేళ్ల వయసులో అమితాబ్ నటించడం విశేషం.


కమల్ హాసన్.. దాదాపు ‘శుభ సంకల్పం’ తర్వాత తెలుగులో డైరెక్ట్ నటించిన సినిమా ‘కల్కి 2898 AD’. ఈ సినిమాకు భారతీయ సినీ పరిశ్రమలో ఏ సినిమాకు లేని విధంగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అంతేకాదు నాన్ హాలీడేలో కూడా ఈ సినిమా ఈ రేంజ్ లో దుమ్ము దులపడం ఖాయం అనిపిస్తోంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్స్ రేట్స్ పెంపుతో పాటు అదనపు షోలకు అనుమతులు మంజూరు చేశారు.


తెలంగాణాలో 75 రూపాయలు సింగిల్ స్క్రీన్స్ పెంచారు. మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు పెంపుకు అనుమతులు ఇచ్చారు. ఇక్కడ 8 రోజుల వరకు టికెట్ పెంపుకు అనుమతులు మంజూరు చేసిన  ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.


ఆంధ్ర ప్రదేశ్ లో సింగిల్ స్క్రీన్స్ రూ. 75 పెంపు.. మల్టీప్లెక్స్ లో రూ.  125 టిక్కెట్ రేటు పెంపుకు అనుమతి మరియు అదనపు షో కి అనుమతులు మంజూరు చేశారు. అక్కడ రెండు వారాల వరకు అనుమతి ఇచ్చింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.ఈ సినిమాలో ప్రభాస్ ‘భైరవ’ సినిమాలో నటించారు. ప్రభాస్ సరసన దీపిక పదుకొనె, దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.


ఈ సినిమాలో  స్పెషల్ యాపిరెన్స్ గా విజయ్ దేవరకొండ, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, శోభన, మాళవిక, పశుపతి తదితరులు నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్,ట్రైలర్,సాంగ్స్ కు అపూర్వ స్పందన ఆడియన్స్ నుంచి వస్తుంది. తెలుగు సహా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 370 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమా బడ్జెట్ రూ. 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇప్పటికే డిజిటల్, శాటిలైట్ రూపేణా.. దాదాపు రూ. 400 కోట్లు రికవరీ అయింది.


Also Read: Padi Kaushik reddy: బ్లాక్ బుక్ లో మొదటి పేరు ఆ మినిస్టర్ దే.. కీలక వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.