Kalki 2898 AD Movie Review: కల్కి పార్ట్ 2 సీక్వెల్ టైటిల్ ఇదేనా.. నాగ్ అశ్విన్ మదిలో ఉన్నది అదేనా..!
Kalki 2898 AD Movie Review: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ఉద్దండ నటులు నటించిన సినిమా ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాటిక్ యూనివర్స్ తో కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లాడు. అయితే మొదటి పార్ట్ కు 2898 AD టైటిల్ పెట్టిన నాగ్ అశ్విన్.. రెండో పార్ట్ కు ఏ టైటిల్ పెడతారనేది ఆసక్తికరంగా మారింది.
Kalki 2898 AD Movie Review: ద్వాపర యుగంలో మహా భారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణ నిర్యాణంతో ద్వాపర యుగం అంతమై.. కలి యుగం మొదలవుతోంది. ఇక నాగ్ అశ్విన్ ఈ సినిమాను మహా భారత యుద్ధంలో ఉప పాండవులపై అస్త్రం ప్రయోగించి ఉప పాండవులతో పాటు ఉత్తర గర్బం విచ్చిన్నం అయ్యేలా ప్రయోగిస్తాడు. అయితే.. గురు పుత్రుడన్న కారణంతో శ్రీకృష్ణుడు అతన్ని చంపకుండా.. అతని ముఖంపై ఉన్న శివమణిని తెలిగిస్తాడు. ఆ తర్వాత 6 వేల యేళ్ల తర్వాత ఈ కథలోకి తీసుకెళ్లాడు. భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉండబోతుందో ఈ సినిమాలో చూపించాడు. భూమిపై ఉన్న వనరులను పీల్చేసి కొత్తగా ‘కాంప్లెక్స్’ అనే ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటాడు సుప్రీమ్ యాస్కిన్. మొత్తంగా చూసుకుంటే తెలుగు ప్రేక్షకులకు సరికొత్త లోకాన్ని పరిచయం చేసాడు నాగ్ అశ్విన్.
ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’ పేరుతో సినిమాలు రాబోతున్నట్టు చెప్పారు. ఇక ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఎండ్ అయిన చోట నుంచి రెండో పార్ట్ కొనసాగించాలి. అయితే ఈ రెండో పార్ట్ కు ‘కల్కి 3102 BC’ పెట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మన దేశ పండితలతో పాటు నాసా కూడా మహా భారతం జరిగింది దాదాపు 3 వేల యేళ్ల క్రితం.. అప్పటి కృష్ణుడి జన్మ నక్షత్రం అనుసరించి గ్రహాలు కూడా అదే స్థానంలో ఉన్నాయి. దీన్ని బట్టి మహా భారతం మన ఇతిహాసంతో పాటు చరిత్ర అని చెప్పొచ్చు. అంతేకాదు శ్రీకృష్ణుడు తన శరీరాన్ని త్యాగం చేసింది ఈ యేడాదిలోనే కాబట్టి ఈ సినిమాకు అదే టైటిల్ పెట్టొచ్చు టాక్ నడస్తోంది.
ఇదీ చదవండి: మన దేశంలో వారాహీ అమ్మవారు దేవాలయాలు ఎక్కడున్నాయి.. వాటి ప్రత్యేకతలు ఏమిటంటే.. !
శ్రీకృష్ణుడి ప్రాణ త్యాగంతో ద్వాపరం అంతం అయి.. కలియుగం ప్రారంభం అవుతోంది. ఇక కలియుగంలో కలి పురుషుడు ఆగడాలు మితిమీరడంతో పాటు .. ధర్మం ఒంటి పాదంపై కుంటుతూ ఉంటుంది. ఆ సమయంలో కలియుగం నాల్కో పాదంలో కల్కి అవతరించి ధర్మ సంస్థాపన చేస్తాడని మన ఇతిహాసాలు చెబుతున్నాయి. మరి రెండో పార్ట్ లో కల్కి అవతారం గురించి చూపిస్తారా లేదా అనేది చూడాలి.
ఇదీ చదవండి: ‘కల్కి 2898 AD’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.