Kalki 2898AD Review: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. కాంబోలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా.. కల్కి 2898 ఏడి. భారీ అంచనాల మధ్య.. ఈ సినిమా ఈ నెల 27 వ తేదీన.. ప్రపంచవ్యాప్తంగా ధియేటర్ లలో విడుదలకి సిద్ధం అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా సినిమా ప్రమోషన్స్ తో.. బిజీగా ఉన్న చిత్ర బృందం.. నిన్న అంటే జూన్ 19 న ముంబై లో భారీ స్థాయిలో.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ప్రభాస్, నాగ్ అశ్విన్ తో పాటు సినిమాలో కీలక పాత్రలలో… నటిస్తున్న అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు… కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.బాహుబలి సమయం నుండి.. ప్రభాస్ కి స్నేహితుడు అయిన రానా దగ్గుబాటి.. ఈ ఈవెంట్ లో హోస్ట్ గా ఇంప్రెస్స్ చేశారు.  


అయితే అందులో మరీ ముఖ్యంగా.. అమితాబ్ బచ్చన్ చిత్ర డైరెక్టర్ నాగ్ అశ్విన్.. గురించి చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. ముందుగా వేదిక మీద ఉన్నప్పుడు అమితాబ్ బచ్చన్..చిత్ర నిర్మాత అశ్విని దత్ సెట్స్ లో తమని.. చాలా బాగా చూసుకున్నారు అని చెబుతూ..ఆయన కాళ్ళ మీద పడటం అందరినీ షాక్ కి గురి చేసింది. అయితే నాగ్ అశ్విన్ ఈ సినిమా కథ నేరెట్ చేసినప్పుడు తన రియక్షన్ గురించి అమితాబ్ చాలా బాగా చెప్పుకొచ్చారు. 


"నా దగ్గరికి నాగ్ అశ్విన్ వచ్చి కథను.. వినిపించినప్పుడు ఇలాంటి అద్భుతమైన కథ తనకి ఏం తాగితే వచ్చి ఉంటుంది.. అని అనిపించింది. కథ అంత ఫ్యూచరిస్టిక్ గా ఉంది. అసలు తను ఎలా ఇలాంటి ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు.. అని అనిపించింది. మేము చిత్రీకరించిన ప్రతి విజువల్ నాగ్ అశ్విన్ మైండ్ నుండి వచ్చినవే. నేను కూడా ఈ సినిమాలో… ఒక చిన్న భాగం కావడం నా అదృష్టం. సినిమా షూటింగ్ నేను జీవితంలో మర్చిపోలేని ఒక అద్భుతమైన అనుభవం" అంటూ నాగ్ అశ్విన్ ని ఆకాశానికి ఎత్తేశారు అమితాబ్ బచ్చన్.  


 



దీపిక పడుకొనే ఈ సినిమాకి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. గర్భవతి అయినప్పటికీ.. ఆమె కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్.. లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. తెలుగు నుండి చాలా మంది స్టార్ లు.. ఈ సినిమాలో క్యామియో పాత్రలలో కనిపించనున్నారు అని సమాచారం. 


బాలీవుడ్ బ్యూటీ దిశా పఠాని, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, లోక నాయకుడు కమల్ హాసన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో.. కనిపించనున్నారు. వైజయంతి బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.


Also Read: O Manchi Ghost: థియేటర్లకు రండి.. హాయిగా నవ్వుకుని వెళ్లండి: OMG మూవీ టీమ్


Also Read: Bharatheeyudu 2: కమలహాసన్ పరిస్థితి ఇలా అయింది ఏమిటి..? భారతీయుడు 2 థియేట్రికల్ బిజినెస్ పై నీలి నీడలు.. ?



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter