Kalki 2898 AD: కల్కి సినిమాలో ఎవరూ గమనించని గెస్ట్ రోల్.. తప్పకుండా మీరు గుర్తుపట్టి ఉండరు!
Kalki 2898 AD Cameos: ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల.. డంకా మోగిస్తోంది. దీపిక పడుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బ్రహ్మానందం, వంటి.. నటీనటులతో పాటు చాలామంది క్యామియో పాత్రలు కూడా పోషించారు. అయితే ఈ ప్రముఖ జంట క్యామియోని.. మాత్రం మీరు గమనించి ఉండరు.
Kalki 2898 AD Collections: కల్కి 2898 ఏడి.. సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు అందరి దృష్టిని.. ఆకర్షిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే టా టకర పాట.. ప్రేక్షకులకు చాలా బాగా నచ్చేసింది. అసలు డిఫరెంట్ జోనర్ లో వస్తున్న కల్కి సినిమాలో ఇలాంటి పాట ఎందుకు అని చాలామంది అన్నారు కానీ.. నాగ్ అశ్విన్ పాటని బాగానే ప్లేస్ చేశారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పాటలో.. డాన్సర్ గా నటి ఫరియా అబ్దుల్లా కామియో.. పాత్రలో కనిపిస్తారు. డైరెక్టర్ అనుదీప్ కేవి కూడా ఒక రెండు సెకండ్ల.. పాటు కనిపిస్తారు. వీళ్లు మాత్రమే కాకుండా.. ఒక జంట కూడా ఈ పాటలో క్యామియో ఇచ్చారు.
సంతోష్ నారాయణన్, తన భార్య మీనాక్షి కూడా ఈ పాటలో ఒక రెండు మూడు సెకండ్ల.. పాటు కనిపిస్తారు. ఆ పాటలో డాన్స్ చేసే చాలామందిలో.. ఈ జంట కూడా ఉంటుంది. చాలామంది వీళ్ళని గుర్తుపట్టి ఉండకపోవచ్చు. కానీ సినిమా విడుదల అయ్యాక.. మాత్రం వీళ్ళిద్దరి ఫోటో కూడా సోషల్ మీడియాలో బాగా కనిపిస్తోంది. తను స్వరపరిచిన.. పాటలో సంతోష్ నారాయణన్ స్వయంగా.. తన భార్యతో క్యామియో ఇచ్చారు.
సంతోష్ నారాయణ తన భార్యతో పాటు సినిమాలో కనిపిస్తారు. కేవలం రెండు మూడు సెకండ్లు మాత్రమే ఈ జంట ఫస్ట్ హాఫ్ లో వచ్చే టాటకర సాంగ్ లో కనిపిస్తారు. దీనికి సంబంధించిన ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇక నాగ్ అశ్విన్ కూడా సినిమాలో ఒక క్యామియో పాత్రలో నటించి ఉంటే ఇంకా బాగుండేది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, అనుదీప్ కేవీ లు కూడా సినిమాలో చిన్న క్యామియో పాత్రలలో ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే కొంతమంది అభిమానులు వారి క్యామియోలు బాగున్నాయి అని ప్రశంసిస్తున్నా కూడా మరికొందరు మాత్రం ఎంత క్యామియో.. అయినా కనీసం ఐదు నిమిషాల నిడివి కూడా లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
రాజేంద్ర ప్రసాద్, మృణాల్ ఠాకూర్ లు కూడా ఫస్ట్ ఆఫ్ లో కొద్దిసేపు మాత్రమే కనిపిస్తారు. ఒకరకంగా వీళ్ళవి కూడా కామియో పాత్రలే అని చెప్పుకోవచ్చు. బ్రహ్మానందం కూడా ఎక్స్టెండర్ కామియో పాత్ర అని చెప్పుకోవచ్చు. సినిమా మొత్తం.. కనిపించకపోయినా అప్పుడప్పుడు కనిపించి ప్రేక్షకులను.. అలరిస్తూ ఉంటారు. ఇక అన్నిటికంటే హై లైట్ బుజ్జి పాత్రకి.. కీర్తి సురేష్ ఇచ్చిన వాయిస్ ఓవర్. మొత్తానికి ప్రేక్షకుల వీటన్నిటిని ఎంజాయ్ చేస్తూ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.
Also Read: Rohit Sharma Retirement: కోహ్లీ బాటలో రోహిత్ శర్మ, టీ20 క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter