Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్
Kalyaan Dhev New Year Wishes కళ్యాణ్ దేవ్ తాజాగా కొత్త ఏడాది సెలెబ్రేషన్స్‌కు సంబంధించి విషెస్ అందించాడు. ఈ ఏడాదికి కావాల్సింది సంతోషం.. స్ట్రాంగ్‌గా ఉండటం కాదు అని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నాను అంటూ కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ అయ్యాడు.
Kalyaan Dhev New Year Wishes కళ్యాణ్ దేవ్ ఈ ఏడాది ఎక్కువగా హైలెట్ అయ్యాడు. తన సినిమాల సంగతి పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్‌లోని సంఘటనలతోనే ఎక్కువగా వైరల్ అయ్యాడు. కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి, కిన్నెరసాని సినిమాలు ఎప్పుడు వచ్చాయ్.. ఎప్పుడు వెళ్లాయ్ అన్న సంగతి కూడా ఎవ్వరికీ తెలియకుండాపోయింది. శ్రీజతో విడాకుల రూమర్లు కళ్యాణ్ దేవ్‌ను మరింతగా ఫేమస్ చేస్తున్నాయి. విడాకులు జరిగాయా?లేదా? అన్న విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
అయితే ఈ ఏడాది మాత్రం కళ్యాణ్ దేవ్ ఎంతో నేర్చుకున్నాడు. ఎంతో నేర్చుకున్నాను.. సహనంగా ఎలా ఉండాలో తెలిసి వచ్చింది.. ఎదుగుదల అంటే ఏంటో తెలిసింది.. అవకాశాలను అందుకోవడం, రిస్క్ తీసుకోవడం తెలుసుకున్నా. నా తప్పుల నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. అవతలి వాళ్లని క్షమించడం, నాతో నేను గడపడం ఇలా ఎన్నో నేర్చుకున్నాను. నా ఈ ప్రయాణంలో ఉండి.. నన్ను నేను మార్చుకునేలా సాయ పడ్డ ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నా కష్టకాలంలో భుజాన్ని అందించిన వారికి థాంక్స్..
మనకు అంతా మంచే జరగాలని అనుకుంటాం కానీ కొన్ని సార్లు అది జరగకపోవచ్చు.. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ మనం చేసే ప్రయత్నాలను వదిలిపెట్టకూడదు.. మీ అందరికీ కొత్త సంవత్సవం అద్భుతంగా ఉండాలని, సంతోషం, ఆరోగ్యం, విజయం అన్నీ చేకూరాలని కోరుకుంటున్నాను అని కళ్యాణ్ దేవ్ చెప్పుకొచ్చాడు.
వచ్చే ఏడాది అయినా కూడా కళ్యాణ్ దేవ్, శ్రీజల వ్యవహారంపై ఓ క్లారిటీ వచ్చేస్తుందేమో చూడాలి. ఇప్పటికే నవిష్కకు కళ్యాణ్ దేవ్ దూరంగా ఉంటున్నాడు. నవిష్క బర్త్ డేను కూడా కళ్యాణ్ దేవ్ సెలెబ్రేట్ చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. కనీసం తన కూతురిని కూడా చూసుకోవడం లేనట్టుంది.
Also Read : Tollywood Deaths In 2022 : టాలీవుడ్‌లో వరుస విషాదాలు.. మరణించిన ప్రముఖులు వీరే
Also Read : Tollywood 2022 : అదిరిన ఆరంభం.. ముభావమైన ముగింపు.. గెలిచిన చిత్రాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి