Tollywood Deaths In 2022 : టాలీవుడ్‌లో వరుస విషాదాలు.. మరణించిన ప్రముఖులు వీరే

Tollywood Deaths In 2022 టాలీవుడ్‌లో సీనియర్ హీరోలు, నటులు మరణించారు. డిసెంబర్ నెలలో అయితే వరుసగా వెంట వెంటనే సీనియర్ నటులైన కైకాల, చలపతి తుది శ్వాస విడిచారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2022, 10:11 AM IST
  • టాలీవుడ్‌లో వరుస విషాదాలు
  • 2022లో నింగికేగిన సూపర్ స్టార్లు
  • డిసెంబర్లో సీనియర్ నటుల మృతి
Tollywood Deaths In 2022 : టాలీవుడ్‌లో వరుస విషాదాలు.. మరణించిన ప్రముఖులు వీరే

Tollywood Deaths In 2022 టాలీవుడ్‌కు ఈ ఏడాది గడ్డు పరిస్థితులే ఏర్పడ్డాయి. ప్రముఖ నటీనటులు మరణించారు. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండే కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ వంటి వారు నింగికెగిశారు. సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, చలపతి రావు వంటి వారు కూడా మరణించారు. అయితే ఘట్టమనేని ఫ్యామిలీలోనే మూడు విషాదాలు నెలకొన్నాయి. మహేష్ బాబుకు దెబ్బ మీద దెబ్బ పడినట్టు అయింది.

ఘట్టమనేని ఫ్యామిలీలో ఈ ఏడాది రమేష్ బాబు, ఇందిరా దేవీ, సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. జనవరి 8న రమేష్ బాబు మృతి చెందారు. కరోనా కారణంగా తన అన్న చివరి చూపుని కూడా మహేష్‌ బాబు చూసుకోలేకపోయాడు. ఇక మహేష్‌ బాబు తల్లి ఇందిరమ్మ సెప్టెంబర్‌లో మరణించారు. ఆ బాధతో సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న మరణించారు. అలా మహేష్‌ బాబు ఈ ఏడాది తన అన్న, అమ్మ, నాన్నలను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాడు.

డిసెంబర్ నెలలో కైకాల సత్యనారాయణ, చలపతి రావులు మరణించారు. ఈ ఇద్దరూ అనారోగ్య సమస్యలతోనే కన్నుమూశారు. డిసెంబర్ 23న కైకాల మరణిస్తే.. చలపతి రావు డిసెంబర్ 23న మరణించారు. అలా ఈ ఏడాది చివర్లో టాలీవుడ్‌ దిగ్భ్రాంతికి లోనైంది. వీరే కాకుండా సీనియర్ నటులు మన్నవ బాలయ్య, దర్శకుడు తాతినేని రామారావు, దర్శకుడు శరత్, సీనియర్ దర్శకులు పీసీ రెడ్డి వంటి వారు తుది శ్వాస విడిచారు. పాటల రచయిత కందికొండ అనారోగ్యంతో మరణించారు.

అదే ఇతర పరిశ్రమల్లో చూసుకుంటే.. బప్పిలహిరి, సింగర్ కేకే, దీప్ సిద్దు, లతా మంగేష్కర్ వంటి ప్రముఖులు కన్నుమూశారు. అలా ఈ ఏడాది చిత్రపరిశ్రమ ఎన్నో చేదు ఘటనలను చవి చూసింది.

Also Read: Dil Raju Shock: 'మైత్రీ'కి మరో షాకిచ్చిన దిల్ రాజు.. త్యాగమూర్తిని కాదంటూ కామెంట్స్!

Also Read: Prabhas on Kriti Sanon: కృతితో రిలేషన్ పై ఓపెన్ అయిపోయిన ప్రభాస్.. అసలు విషయం ఏంటంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News