Kalyaan Dhev Daughter : కూతురిని తెగ మిస్ అవుతున్నట్టున్నాడు.. కళ్యాణ్ దేవ్ కదిలించే పోస్ట్
Kalyaan Dhev Daughter కళ్యాణ్ దేవ్ తన కూతురికి దూరంగా ఉంటున్నాడన్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ దేవ్, శ్రీజల మధ్య ఉన్న రిలేషన్ ఏంటన్నది ఇప్పుడు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఈ ఇద్దరూ విడిపోయారా? అన్నది కూడా క్లారిటీగా తెలియడం లేదు.
Kalyaan Dhev Daughter Navishka కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం శ్రీజకు దూరంగానే ఉంటున్నాడు. శ్రీజ, కళ్యాణ్‌ల మధ్య విడాకులు జరిగాయా? లేదా? అన్నదే ఓ పెద్ద మిస్టరీలా ఉంటుంది. ఈఇద్దరూ కలిసి ఉండక చాలా రోజులే అయింది. గత రెండేళ్లుగా ఈ ఇద్దరూ కలిసి ఫోటో ఒక్కటి కూడా బయటకు రాలేదు. ఇన్ స్టాగ్రాంలోనూ అన్ ఫాలో చేసుకున్నారు. శ్రీజ అయితే తన పేరుని మార్చుకుంది. శ్రీజ కళ్యాణ్ నుంచి శ్రీజ కొణిదెలగా పేరు మార్చుకుంది.
ఇక శ్రీజ ఈ కొత్త సంవత్సరం నుంచి కొత్త పాట పాడుతోంది. తనది తానే ప్రేమించుకుంటున్నాను అని, తనకంటే తనను బాగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరని, సెల్ఫ్ లవ్ కంటే గొప్పది ఏమీ లేదని ఇలా కొత్త రాగం అందుకుంది శ్రీజ. అంటే కళ్యాణ్ దేవ్‌తో విడాకులు అయ్యాయని, తమ బంధం తెంచుకున్నామని ఇలా పరోక్షంగా చెప్పేస్తోంది శ్రీజ.
[[{"fid":"258996","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
అయితే శ్రీజ తన కూతురు నవిష్కతో హ్యాపీగా ఉంది. కానీ కళ్యాణ్ దేవ్ మాత్రం తన కూతురిని తలుచుకుంటూ తెగ ఫీల్ అవుతున్నాడు. తన కూతురిని మిస్ అవుతున్నాను అంటూ పోస్టులు పెడుతూనే ఉన్నాడు. నవిష్క బర్త్ డే సందర్భంగా కళ్యాణ్ దేవ్ వేసిన పోస్ట్ అందరినీ కదిలించింది. తన నవ్వుకు కారణం తన కూతురని, తన బిడ్డే తనకు ప్రపంచమని ఇలా చెప్పుకుంటూ పోయాడు.
తన కూతురితో గడపలేకపోతోన్నందుకు తెగ ఫీలవుతున్నాడు కళ్యాణ్ దేవ్. ఇప్పుడు కూడా తన కూతురి వీడియోని చూసి ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు. కళ్యాణ్ దేవ్ తన కూతురిని తలుచుకంటూ మిస్ యూ సో మచ్ అంటూ పోస్ట్ వేశాడు. మరి కళ్యాణ్ దేవ్ ఇంకెన్నాళ్లు తన కూతురికి దూరంగా ఉండాల్సి వస్తుందో చూడాలి.
Also Read: Ramya Krishnan Pics : హాట్ లుక్కులో రమ్యకృష్ణ.. సీనియర్ నటి పోజులు చూస్తే దిమ్మతిరగాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి