Kalyan Ram Amigos Collections నందమూరి కళ్యాణ్‌ రామ్ అమిగోస్ సినిమా మీద సాధారణంగా అంచనాలుంటాయి. బింబిసారా సినిమాతో కళ్యాణ్‌ రామ్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కళ్యాణ్‌ రామ్ సినిమాలు ఎవరు చూస్తారు.. మార్కెట్ ఉందా? కలెక్షన్లు వస్తాయా? అని అంతా అనుకున్నారు. కానీ బింబిసారా సినిమా అదరగొట్టేసింది. కళ్యాణ్ రామ్‌ను మళ్లీ నిలబెట్టేసింది. పటాస్ తరువాత బింబిసారా మళ్లీ కళ్యాణ్‌ రామ్‌ను రేసులోకి తీసుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కళ్యాణ్‌ రామ్ నుంచి బింబిసారా తరువాత వచ్చిన అమిగోస్ మీద ఉన్న అంచనాలు అందరికీ తెలిసిందే. త్రిపాత్రాభినయం చేయడం, కొత్త పాయింట్ ఊరిస్తూ వచ్చారు. అయితే తీరా ఈ సినిమా జనాల అంచనాలను అందుకోలేకపోయింది. మౌత్ టాక్ సైతం సరిగ్గా లేదు. రివ్యూలు సైతం యావరేజ్ అని తేల్చి పడేశాయి. దీంతో కలెక్షన్లు దారుణాతి దారుణంగా పడిపోయాయి.


బింబిసారా సినిమాకు మొదటి రోజు ఏడు కోట్ల వరకు వచ్చాయి. అదే అమిగోస్ సినిమాకు రెండున్నర కోట్లు మాత్రమే వచ్చాయట. ఇక ఈ సినిమా పన్నెండు కోట్లను కలెక్ట్ చేస్తే తప్పా బ్రేక్ ఈవెన్ అయ్యేట్టుగా లేదని సమాచారం. ఈ లెక్కన ఈ చిత్రానికి వచ్చిన టాక్ చూస్తే బ్రేక్ ఈవెన్ కూడా కష్టమని తెలుస్తోంది.


మరో పక్క అమిగోస్ సినిమాకు ఓవర్సీస్‌లో చేదు అనుభవం ఏర్పడింది. రైటర్ పద్మభూషణ్ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయట. ఓవర్సీస్‌లో నిన్నటి లెక్కలు తీస్తే.. అమిగోస్‌కు తక్కువగా వచ్చాయట. అక్కడ ఇంకా రైటర్‌కే జనాలు మొగ్గు చూపుతున్నారట. ఇప్పటికే రైటర్‌ సినిమాకు 300k డాలర్లను కలెక్ట్ చేసింది. చూస్తుంటే హాఫ్ మిలియన్ డాలర్‌ క్లబ్బులో చేరేట్టుగా ఉంది. కానీ అమిగోస్ మాత్రం రైటర్‌కు చాలా దూరంలోనే ఆగేట్టు కనిపిస్తోంది.


తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రైటర్ బ్రేక్ ఈవెన్ జరిగింది. ఆల్రెడీ లాభాల్లోకి వచ్చింది. రైటర్ సినిమా కలెక్షన్ల పరంగా బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తోంది. ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీలు ఈ సినిమాను మెచ్చుకున్నారు. మహేష్‌ బాబు సైతం ఈ సినిమా ఎమోషనల్‌గా ఎంతో బాగుందని అన్నాడు. మహిళల కోసం ఈ సినిమాను ఉచితంగా ప్రదర్శించిన సంగతి తెలిసిందే.


Also Read:  Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే


Also Read: SSMB 28 Look : మహేష్‌ బాబు లెటెస్ట్ లుక్.. మరింత తగ్గిపోయాడే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook