Kalyan Ram on Name Change: పేరు మార్చడం నాకు బాధ కలిగించింది.. ఇలా వాడుకోవడం తప్పు!
Kalyan Ram Response on Vijayawada Dr NTR Health Univeristy Name Change: జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య, హరికృష్ణ పెద్ద కుమారుడు కళ్యాణ్ రామ్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మారుస్తూ వైయస్సార్ పేరు పెట్టిన విషయం మీద స్పందిస్తూ ఒక సుదీర్ఘ ట్వీట్ చేశారు.
Kalyan Ram Response on Vijayawada Dr NTR Health Univeristy Name Change: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మారుస్తూ వైయస్సార్ పేరును చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఒక బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం మీద రాజకీయ దుమారం రేగింది. ఈ విషయంలో ముందు నుంచి వైఎస్ జగన్ కు అనుకూలంగా ఉన్నవారు సైతం కొంతమంది బాహటంగానే ఇలా చేయడం కరెక్ట్ కాదని విమర్శిస్తుంటే తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా గతంలో పనిచేసిన ఎన్టీఆర్ మాత్రం తెలివిగా కర్ర విరగకుండా పాము చావకుండా సమాధానం చెబుతూ ట్వీట్ చేశారు.
ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య, హరికృష్ణ పెద్ద కుమారుడు కళ్యాణ్ రామ్ ఈ విషయం మీద స్పందిస్తూ ఒక సుదీర్ఘ ట్వీట్ చేశారు. మెడికల్ యూనివర్సిటీ స్థాపనకు ఉన్న కారణాలు వివరిస్తూ 1986లో విజయవాడ మెడికల్ యూనివర్సిటీ స్థాపించబడిందని ఆంధ్ర ప్రదేశ్ లోని మూడు ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ఎన్టీఆర్ ఈ మహా విశ్వవిద్యాలయానికి అంకురార్పణ చేశారని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.
ఈ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశంలో అత్యుత్తమంగా అభివృద్ధి చెందిందని లెక్కలేనంతమంది నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులను దేశానికి అందించిందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలలోనే వైద్య అధ్యయనాలు మెరుగుదలకు ఆయన చేసిన కృషిని స్మరించుకునేందుకు విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనే పేరు మార్చబడిందని ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 25 ఏళ్లకు పైగా ఉనికిలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పేరు మార్చడం నాకు బాధ కలిగించిందని, కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.
కేవలం రాజకీయ లాభం కోసం చాలా మందికి భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు ఇక కళ్యాణ్ రామ్ ట్వీట్ చూసిన టీడీపీ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తున్నారు. మీ అన్నకి ఉన్న గట్స్ కూడా నీకు లేవా ఇక్కడ రాజకీయం ఏముంది? నువ్వు నిజంగా నందమూరి వారసుడు అనుకుంటే దీనిపై ఆ రేంజ్ లో స్పందించి ఉంటే బాగుండేది, వేరే వ్యక్తిని మీ తాత గారితో కలిపి కీర్తిస్తూ ఏం చేద్దామని నీ ఉద్దేశం అంటూ టీడీపీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు ఎన్టీఆర్ కంటే నువ్వే బెస్ట్ అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఎన్టీఆర్ ను సపోర్ట్ చేస్తూ ఎన్టీఆర్ తన అభిప్రాయాన్ని చెప్పాడు, ఇందులో ఆయన తప్పుపట్టాల్సిన అవసరం ఉందని ప్రశ్నిస్తున్నారు.
Also Read: Chandrababu Fires on Jr NTR: ఎన్టీఆర్ కి, వైఎస్ఆర్ కి పోలికా ? సిగ్గు ఉండాలి..బాబు ఘాటు కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook