Indian 2: ఓటీటీ స్త్రీమింగ్ కి సిద్ధమైపోయిన భారతీయుడు 2.. ఎప్పుడంటే..?
Indian 2 OTT: శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా.. వచ్చిన చిత్రం భారతీయుడు. ఎన్నో సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ భారతీయుడు 2 ఈ మధ్యనే థియేటర్స్ లో విడుదలయ్యింది. అయితే ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా విజయం సాధించలేదు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి.. సిద్ధమైపోయింది.
Indian 2 OTT Release: భారతీయుడు సినిమా తమిళంతో పాటు.. తెలుగులో కూడా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమె. 1996లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్..విజయం సాధించింది. శంకర్ దర్శకత్వం.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్.. కమల్ హాసన్ నటన.. ఆ సినిమాకి హైలైట్ గా నిలిచాయి.
ఇక దాదాపు 28 సంవత్సరాల తరువాత.. ఈ సినిమాకి సీక్వెల్ ప్రకటించారు శంకర్. దాంతో ఈ చిత్ర సీక్వెల్ భారతీయుడు దుపైన అంచనాలు భారీగా పెరిగాయి. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్.. ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 12న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలోనే విడుదలైంది. తమిళంలో ఇండియన్ 2 గా, అలానే హిందీలో హిందుస్థాన్ 2 పేరుతో విడుదలైన ఈ చిత్రం.. విడుదలైన అన్ని భాషలలోని ఫ్లాప్ గా నిలిచింది.
బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ సాధించలేక విడుదలైన వారంలోనే డీల బడిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. ఈ చిత్రం.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకి రానుంది అని.. నెట్ఫ్ ఫ్లిక్స్ సంస్థ స్వయంగా ఈరోజు ట్విట్టర్ లో పోస్ట్ వేసింది. ఈ సినిమా ఓటీటీలో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో భారతీయుడు 2 అలరించనుంది.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ సాధించకపోయినప్పటికీ..కమల్ హాసన్ అద్భుతమైన నటన, శంకర్ టేకింగ్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. లంచగొండులపై సేనాపతి తాత ఎలా పోరాటం చేశాడనే కథాంశంతో రూపొందిన భారతీయుడు 2 సినిమాలో కమల్ హాసన్ తో పాటు..సిద్ధార్థ్, ఎస్.జె.సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, గుల్షన్ గ్రోవర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ త్వరలోనే రానుంది.
Read more:Snake vs Lizard: మానిటర్ బల్లిని కసితీరా కాటు వేసిన నల్ల పాము.. షాకింగ్ వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter