Vikram OTT Date: విలక్షణ నటుడు కమల్ హాసన్ సినిమా విక్రమ్ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ వర్షం కురిపిస్తున్న ఈ సినిమా ఓటీపీ రిలీజ్ డేట్‌పై స్పష్టత వచ్చేసింది. ఎప్పుడు స్ట్రీమ్ అయ్యేది ఖరారైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుదీర్ఘకాలం తరువాత వెండితెరపై కన్పించడమే కాకుండా సూపర్ డూపర్ హిట్ కొట్టాడు కమల్ హాసన్. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్‌తో పాటు..విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన విక్రమ్ సినిమా బాక్సాఫీసు వద్ద భారీగా కలెక్షన్లు చేస్తోంది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్ దాటేసింది. సినిమా కధ, కంటెంట్, టేకింగ్, కమల్ విజయ్, ఫహద్‌ల నటనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తమిళనాట థియేటర్లు హౌస్‌ఫుల్ కలెక్షన్సు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ విడుదలపై స్పష్టత వచ్చింది. 


విక్రమ్ సినిమా ఓటీటీ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ప్రేక్షకులంతా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో జూలై 8 నుంచి హాట్‌స్టార్‌లో విక్రమ్ సినిమా స్ట్రీమింగ్ కానుందనే వార్త వైరల్ అవుతోంది. అధికారికంగా డిస్నీ హాట్‌స్టార్ నుంచి ఏ విధమైన ప్రకటన లేకపోయినా..జూలై 8 స్ట్రీమింగ్ దాదాపుగా ఖరారైంది. 


Also read: Rashmi Found Dead :సీక్రెట్ గా సహజీవనం.. అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook