Rashmi Found Dead :సీక్రెట్ గా సహజీవనం.. అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య

Rashmi Rekha Ojha Found Dead : గత కొద్దికాలంగా సాగుతున్న నటీమణుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా బుల్లితెర నటి ఒకరు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 21, 2022, 02:46 PM IST
    • ఒడిశాలోని తన అద్దె ఇంట్లో ఉరి వేసుకుని కనిపించిన రష్మీ రేఖ ఓజా

    • ఆమె లివ్-ఇన్ పార్టనర్ వల్లే అని అనుమానం

    • అసహజ మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు

Rashmi Found Dead :సీక్రెట్ గా సహజీవనం.. అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య

Rashmi Rekha Ojha Found Dead : ఈ మధ్య కాలంలో నటీమణుల వరుస అనుమానాస్పద మరణాలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే బెంగాలీ నటీమణులు కొందరు వరుసగా మృత్యువాత పడ్డారు. ఇప్పుడు మరో వర్ధమాన నటి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ప్రముఖ ఒడియా టీవీ నటి రష్మీ రేఖ ఓజా మృతదేహం లభ్యం కావడంతో ఒడియా బుల్లితెర పరిశ్రమ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. భువనేశ్వర్‌లోని నయాపాలిలో తానూ అద్దెకున్న ఇంట్లో 23 ఏళ్ల రష్మీ రేఖ మృతదేహం ఉరి వేసుకుని కనిపించిందని చెబుతున్నారు. ఆమె మృతికి అసలు కారణం ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఆమె మృతికి ఆమెతో సహజీవనం చేస్తున్న సంతోష్ పాత్రో కారణమని రష్మీ రేఖ తండ్రి ఆరోపించారు. 

ప్రముఖ ఒరియా టెలివిజన్ నటి రష్మీరేఖ ఓజా మృతి చెందారు. భువనేశ్వర్‌లోని తన అద్దె ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ ఆమె మృతదేహం కనిపించింది. ఆమె ఇక్కడ నయాపాలి ప్రాంతంలో నివసించేది. ఒడియా మీడియా నివేదికల ప్రకారం,  23 ఏళ్ల రష్మీ తండ్రి తన కుమార్తె ఆత్మహత్య విషయంలో ఆమెతో పాటు సహజీవనం చేస్తున్న సంతోష్ పాత్రో ప్రమేయం ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తన కూతురు చనిపోయిందని సంతోష్ తన దృష్టికి తీసుకువచ్చారని ఆయన పోలీసులకు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించి అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. 

ఒక పోలీసు అధికారి మీడియాకు ఇచ్చిన ప్రకటనలో,  "జూన్ 18 న,  23 ఏళ్ల నటి తన అద్దె ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. ప్రస్తుతం పోస్ట్‌మార్టం నివేదిక కోసం వేచి ఉన్నాం. అని అన్నారు.  శనివారం రష్మీకి ఆమె తండ్రి పలుమార్లు కాల్ చేసినా ఆమె ఫోన్ ఎత్తలేదు. ఆ తర్వాత ఆయనకు సంతోష్ ఫోన్ చేసి రష్మీ చనిపోయిందని చెప్పాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆమె తండ్రికి సంతోష్,  రష్మిలు భార్యాభర్తలు అని చెప్పుకుని ఇంటిని అద్దెకు తీసుకున్నారని ఆ ఇంటి యజమాని ద్వారా తెలిసింది. అయితే అంతకు ముందు తమ కుమార్తె లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి తనకు తెలియదని రష్మీ తండ్రి పోలీసులకు వెల్లడించారు. 

తన చావుకు ఎవరూ బాధ్యులు కారని రష్మీ సూసైడ్ నోట్‌ను కూడా ఉంచడంతో ఇది ఆత్మహత్యగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక హైదరాబాద్ లో కూడా డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ళ ఆత్మహత్య చేసుకుని మరణించారు. కొన్ని వారాల క్రితం,  బెంగాలీ సినీ నటి బిదిషా డి మజుందార్ మృతదేహం కూడా ఆమె కోల్‌కతా అపార్ట్మెంట్ లో ఇదే రీతిలో దొరికింది. పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు.  బిదిషా తనకు అవకాశాలు రాలేదని సూసైడ్ నోట్ కూడా రాసింది. అంతకు ముందు బెంగాలీ నటి పల్లవి డే కూడా తన ఇంట్లో శవమై కనిపించింది. పోలీసులు ఈ కేసులో ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు.  

Also Read: Actress Rekha Suicide: యాంకర్, టీవీ నటి రేఖ ఆత్మహత్య

Also Read: Actress Soujanya Suicide: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News