Kamal Haasan : అప్పుల్లోంచి బయట పడ్డాక వాళ్లకు పెద్ద పార్టీ.. మెనూ వింటే మతి పోవాల్సిందే!
Kamal Haasan Success Party : తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ `విక్రమ్` సినిమాతో మరోమారు సూపర్ హిట్ అందుకున్నాడు. విజయోత్సాహంతో తాజాగా ఒక భారీ విందు ఏర్పాటు చేశారు.
Kamal Haasan throws a Success Party : తమిళ స్టార్ హీరో అయిన కమల్ హాసన్ చాలా కాలంగా సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడ్డారు. అలాంటి సమయంలో ఆయన ప్రధాన పాత్రలో ఖైదీ, మాస్టర్ సినిమాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన 'విక్రమ్' సినిమాతో మరోమారు సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతో చాలా కాలం తరువాత తన సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఫిలింస్లో 'విక్రమ్' సినిమాను నిర్మించారు కమల్ హాసన్. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న క్రమంలో తన అప్పులు అన్నీ తీర్చేస్తున్నానని ప్రకటించారు కమల్ హసన్. ఈ క్రమంలో విజయోత్సాహంతో తాజాగా ఒక భారీ విందు ఏర్పాటు చేశారు.
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'విక్రమ్' సినిమాలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలకమైన పాత్రలను పోషించారు. తమిళ స్టార్ హీరో సూర్య కూడా రోలెక్స్ అనే ఒక అతిధి పాత్రలో నటించారు. ఇక అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఆయన అందించిన నేపధ్య సంగీతానికి అయితే ఎనలేని రెస్పాన్స్ లభించింది. అలా జూన్ నెల 3వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. సినిమా విడుదలైన తర్వాత మొదటి ఆట నుంచి ప్రతి ప్రాంతంలో ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. అయితే ఈ సినిమా తమిళ బాహుబలి రికార్డులు కూడా బద్దలు కొట్టే అవకాశం ఉందని అంటున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా హిట్ కావడంతో తన అప్పులు అన్నీ తీర్చుకుంటున్నట్టు కమల్ హాసన్ ప్రకటించారు. కమల్ కి ఈ సినిమా ఇప్పటికే భారీ లాభాలను తెచ్చి పెట్టడంతో పాటు ఆయనను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించింది. దీంతో తనకు ఇలాంటి హిట్ సినిమా ఇచ్చిన లోకేష్ కనగరాజ్ కి కోటి రూపాయాల కారును కొనిపెట్టారు కమల్ హాసన్. ఇక ఇప్పుడు 'విక్రమ్' సక్సెస్ నేపధ్యంలో సినిమా థియేటర్ల యజమానులు, డిస్టిబ్యూటర్లు, అలాగే ప్రెస్ వారికి ఒక గ్రాండ్ లంచ్ పార్టీ ఇచ్చారు. ఇందులో అటు వెజ్, నాన్ వెజ్ కలిపి 30 నుంచి 35 వెరైటీలు వడ్డించారు.
మాములుగా లోకేష్ సినిమాలలో విలన్లు, హీరోలు తిండి ప్రియులన్నట్టు చూపిస్తారు. ఇప్పుడు అదే కోవలో చాలా రకాల సూపులు, స్వీట్లు, నాన్ వెజ్ స్టార్టర్లు, వెజ్ స్టార్టర్లు, సుమారు 20 రకాల మెయిన్ కోర్సు ఐటమ్స్, కొన్ని రకాల డిజర్ట్స్ కూడా విందులో ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఈ పార్టీకి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక లోకి యూనివర్స్ అంటూ లోకేష్ కనగరాజ్ ను ఒక రేంజ్ లో పొగిడేస్తున్నారు నెటిజన్లు. ఇక ఆయన రామ్ చరణ్ లేదా అల్లు అర్జున్ లతో సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన అయితే లేదు కానీ ఆ మేరకు ప్రచారం మాత్రం గట్టిగానే సాగుతోంది.
Also Read : Telugu Indian Idol : విన్నర్గా జూనియర్ పూజా హెగ్డే.. మెగాస్టార్ చిలిపి కవితలు!
Also Read :Jr NTR Craze in Israel: పత్రికల్లో ఎన్టీఆర్ మీద కథనాలు.. పాన్ ఇండియా కాదిక.. పాన్ వరల్డ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook