Jr NTR Craze in Israel: పత్రికల్లో ఎన్టీఆర్ మీద కథనాలు.. పాన్ ఇండియా కాదిక.. పాన్ వరల్డ్!

Jr NTR Craze in Israel: ఆర్ఆర్ఆర్ సినిమాతో సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ లభిస్తోంది.  ఆయన మీద తాజాగా ఇజ్రాయెల్ న్యూస్ పేపర్లలో ప్రత్యేక కధనాలు ప్రచురితం అయ్యాయి.  

Last Updated : Jun 18, 2022, 10:01 AM IST
  • ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్
  • ఇజ్రాయెల్ పత్రికల్లో ఎన్టీఆర్ మీద కథనాలు
  • గాల్లో తేలుతున్న ఎన్టీఅర్ ఫాన్స్
Jr NTR Craze in Israel: పత్రికల్లో ఎన్టీఆర్ మీద కథనాలు.. పాన్ ఇండియా కాదిక.. పాన్ వరల్డ్!

Jr NTR Craze in Israel: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం ఆర్ఆర్ఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. భారీ బడ్జెట్తో డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించారు.  ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ తేజ్ నటించగా కొమురం భీం పాత్రలో నందమూరి తారక రామారావు(జూ.ఎన్టీఆర్) నటించారు. రామ్ చరణ్ సరసన అలియా భట్ నటించగా ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటించారు. ఇక ఇతర కీలక పాత్రలలో అజయ్ దేవగన్, శ్రేయ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, మకరంద్ దేశ్ పాండే వంటి వారు నటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎక్కడా తగ్గకుండా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. 

ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించిందో ఇప్పుడు డిజిటల్ వేదికగా విడుదలైన తర్వాత కూడా దాదాపు అన్ని సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ జరుగుతుండగా తమిళ, కన్నడ, మలయాళ, తెలుగు భాషలకు సంబంధించిన స్ట్రీమింగ్ మాత్రం జీ5 యాప్ లో జరుగుతోంది. అయితే నెట్ ఫ్లిక్స్ కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న కారణంగా ఈ సినిమా గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమా గురించి ఎంత చర్చ జరుగుతోందో, ఎన్టీఆర్ పర్ఫామెన్స్ గురించి కూడా అంతే ఎత్తున చర్చ జరుగుతోంది అనే వాదన వినిపిస్తోంది. 

తాజాగా ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఇజ్రాయిల్ పత్రికలో వచ్చిన ఒక కథనానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ సినిమాలోని క్లైమాక్స్ ఫైట్లో బైక్ ఎత్తి బ్రిటిష్ సైన్యంతో పోరాడుతున్న ఫోటో ప్రచురించిన ఒక ఇజ్రాయిల్ పత్రిక సినిమాలో ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిందని తెలుస్తోంది. ఇక నెట్ ఫ్లిక్స్ నుంచి సినిమాకు సంబంధించిన స్క్రీన్ షాట్లు షేర్ చేస్తూ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా ఆ కథనం మొత్తం ప్రచురించారని తెలుస్తోంది ఇజ్రాయెల్ భాష మనకు అర్థం కావడం లేదు కానీ సదరు కధనంలో మాత్రం ఎన్టీఆర్ను రెండు చోట్ల చూపించడంతో బహుశా ఎన్టీఆర్ నటన గురించే ప్రస్తావించి ఉంటారు అంటూ నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఆర్ఆర్ఆర్ సినిమా ధియేటర్లలో విడుదలైన దానికంటే తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ మొదలైన తర్వాత సినిమా మీద దేశవిదేశాల నుంచి మరింత ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రతి తెలుగు వాడు కూడా గర్వించదగిన విషయం అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఒక తెలుగు సినిమాకి దేశవిదేశాలలో ఈ మేర గుర్తింపు లభిస్తుంది అంటే అది మామూలు విషయం కాదని, కేవలం ఇది రాజమౌళి వల్లే సాధ్యమైందని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా తెలుగు సినిమా ఆ మేరకు గుర్తింపు దక్కించుకోవడం గర్వించవలిసిన విషయం. 
Also Read : Liplock seen: ఆ కుర్రహీరోకు చాందినీ లిప్‌కిస్ ఎందుకిచ్చిందో తెలుసా..ఇదే కారణం

Also Read : Actress Aishwarya: ఒకప్పుడు స్టార్ హీరోల సరసన హీరోయిన్.. ఇప్పుడు సబ్బులు అమ్ముకుంటోంది..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News