Kamal Haasan starrer Vikram movie release on June 3: కోలీవుడ్ స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా నటించిన చిత్రం 'విక్రమ్'. ఖైదీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ స్వయంగా నిర్మిస్తున్నారు. యాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. విక్రమ్ చిత్రానికి సంగీతం సమకూర్చారు. బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిలో కమల్ హాసన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విక్రమ్ లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈరోజు ఉదయం 'విక్రమ్' సినిమా మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'బిగ్గెస్ట్ యాక్షన్' అంటూ టైటిల్ ఇచ్చారు. యాక్షన్ సన్నివేశాలకు సంబందించిన గ్లింప్స్ చాలా బాగా చూపించారు. విజయ్ సేతుపతి గన్ పట్టుకుని స్టైలిష్ లుక్‌లో అదరగొట్టారు. ఇక ఫహద్ ఫాసిల్ లేసర్ పట్టుకుని ఏదో పరిశీలిస్తున్నాడు. కమల్ హసన్ అయితే ఫైట్‌కు సిద్ధంగా ఉన్నాడు. ఇక వీడియో చివరలో సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. 



ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విక్రమ్ సినిమాలో కోలీవుడ్ స్టార్స్ ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివాని నారాయణన్, కాళిదాస్ జయరామ్, నరేన్, ఆంటోనీ వర్గీస్, అర్జున్ దాస్ కూడా సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ తారాగణం నేపథ్యంలో అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ 'ఇండియన్ 2'లో కూడా నటిస్తున్నారు.


Also Read: Rishabh Pant: కపిల్ దేవ్ 40 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ పంత్!!


Also Read: Nayanthara Marriage: షాకింగ్.. గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిచేసుకున్న స్టార్ హీరోయిన్! ఇదిగో సాక్షం!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook