Rishabh Pant: కపిల్ దేవ్ 40 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ పంత్!!

Rishabh Pant breaks Kapil Dev Test record. టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా రిషబ్ పంత్‌ నిలిచాడు. 28 బంతుల్లోనే ఫిఫ్టీ బాదడంతో  టీమిండియా దిగ్గజం కపిల్‌ దేవ్‌ రికార్డును బద్దలుకొట్టాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2022, 09:53 AM IST
  • 28 బంతుల్లోనే ఫిఫ్టీ
  • పంత్‌ అరుదైన రికార్డు
  • కపిల్ దేవ్ 40 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ పంత్
Rishabh Pant: కపిల్ దేవ్ 40 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ పంత్!!

Rishabh Pant breaks Kapil Dev's 40 years old Test Record: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు (డేనైట్)లో టీమిండియాయువ వికెట్‌ కీపర్‌ రిషబ్ పంత్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. బెంగళూరు చిన్నస్వామి మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో సూపర్ ఫిఫ్టీ బాదాడు. ఆడేది టెస్టు మ్యాచా లేదా టీ20నా అన్న రీతిలో ఆడాడు. భారీ షాట్లతో లంక బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 28 బంతుల్లోనే (7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దాంతో టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు. 

టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా రిషబ్ పంత్‌ నిలిచాడు. 28 బంతుల్లోనే ఫిఫ్టీ బాదడంతో  టీమిండియా దిగ్గజం కపిల్‌ దేవ్‌ రికార్డును బద్దలుకొట్టాడు. 1982లో కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కపిల్ 30 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 40 ఏళ్లుగా ఈ రికార్డు కపిల్ పేరుపై ఉండగా.. తాజాగా పంత్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. గతేడాది ఇంగ్లండ్‌తో జరిగిన ఓవల్ టెస్టులో 31 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన శార్దూల్ ఠాకూర్ మూడో స్థానంలో ఉన్నాడు. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చెన్నైలో ఇంగ్లండ్‌పై 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు.

టెస్టుల్లో ఆడిన 50 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (42) బాదిన వికెట్‌ కీపర్‌గా రిషబ్ పంత్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటి వరకు (51 ఇన్నింగ్స్‌)తో కలిపి మొత్తంగా 44 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో పంత్‌ తర్వాతి స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ (31 సిక్సర్లు), ఆసీస్‌ మాజీ ఆటగాడు బ్రాడ్‌ హాడిన్‌ (31), ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ ఆడం గిల్‌క్రిస్ట్‌ (30), ఇంగ్లండ్‌ స్టార్ ఆటగాడు జోస్‌ బట్లర్‌ (21) ఉన్నారు. ధోనీ టెస్టు కెరీర్‌లో 90 మ్యాచులు ఆడి 78 సిక్సర్లు కొట్టాడు. పంత్‌ మాత్రం 30 మ్యాచ్‌లలోనే 44 సిక్స్‌లు బాదడం విశేషం. మొత్తంగా టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన వికెట్‌ కీపర్ల జాబితాలో గిల్‌క్రిస్ట్‌ (100) టాప్‌లో ఉన్నాడు.

గులాబీ టెస్టులో ఆధిపత్యాన్ని కొనసాగించిన భారత్‌ ఘన విజయం దిశగా సాగుతోంది. రెండో రోజైన ఆదివారం శ్రేయస్‌ అయ్యర్‌ (67), రిషబ్ పంత్‌ (50), రోహిత్‌ శర్మ (46) మెరవడంతో భారత్ 303/9 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కలుపుకొని శ్రీలంకకు 447 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి లంక 28/1తో నిలిచింది. మ్యాచ్ దాదాపుగా ఈరోజు ముగిసే అవకాశాలు ఉన్నాయి. 

Also Read: Janasena Avirbhava Sabha: నేడు జనసేన ఆవిర్భావ సభ.. భావికార్యాచరణపై పవన్‌ ప్రకటన!!

Also Read: Nayanthara Marriage: షాకింగ్.. గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిచేసుకున్న స్టార్ హీరోయిన్! ఇదిగో సాక్షం!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News