Kangana on Gehraiyaan: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut)..తరుచూ వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఈమె చేసే వ్యాఖ్యలు, పెట్టే పోస్టులు కాంట్రవర్సీకి దారితీస్తుంటాయి. తాజాగా దీపికా నటించినా '‘గెహ్రాహియా'’(Gehraiyaan) సినిమాపై పరోక్షంగా విమర్శలు చేసింది కంగనా.  స్కిన్​షో-అశ్లీలత ఏ సినిమాను కాపాడలేవంటూ చెప్పుకొచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 దీపికా పదుకునే- సిద్ధాంత్‌ చతుర్వేది, అనన్యా పాండే- ధైర్యా కర్వా కీలకపాత్రల్లో నటించిన సినిమా  ‘గెహ్రాహియా.  షకున్ బత్రా (Shakun Batra) దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సుమిత్‌ రాయ్‌ కథ అందించారు. కరణ్‌ జోహర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ ధర్మా ప్రొడక్షన్స్‌ హౌస్‌ నిర్మించింది. ప్రేమ, స్నేహం, వ్యక్తిగత సంబంధాలు నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ (Amazon prime videos) ఓటీటీ వేదికగా రిలీజ్ అయ్యింది.


తాజాగా దీపికాతో(Deepika Padukone) పాటు చిత్రంపై కూడా వివాదస్పద కామెంట్స్ చేసింది కంగనా. '' నేను ఈ జనరేషన్‌కు చెందిన వ్యక్తినే. తాను ఇలాంటి రొమాన్స్​ను అర్థం చేసుకోగలను. న్యూ ఏజ్ మూవీ పేరుతో ఇలాంటి చెత్త సినిమాను రిలీజ్ చేయకండి. బ్యాడ్​ మూవీస్ ఎప్పుడు బ్యాడ్ సినిమాలే. స్కిన్​షో, రొమన్స్ వాటిని ఏ మాత్రం రక్షించలేవు. ఇది చాలామందికి తెలిసిందే" అని కంగన తన ఇన్​స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. 


Also Read: Ravi Teja: రవితేజపై 'ఖిలాడి' డైరెక్టర్‌ భార్య షాకింగ్‌ కామెంట్స్‌...'చీప్ స్టార్' అంటూ వ్యాఖ్యలు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook