Ravi Teja: రవితేజపై 'ఖిలాడి' డైరెక్టర్‌ భార్య షాకింగ్‌ కామెంట్స్‌...'చీప్ స్టార్' అంటూ వ్యాఖ్యలు...

Khiladi Controversy :  హీరో రవితేజపై ఖిలాడి డైరెక్టర్‌ రమేష్ వర్మ భార్య సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ అసలేం జరిగిందంటే...  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2022, 11:49 AM IST
Ravi Teja: రవితేజపై 'ఖిలాడి' డైరెక్టర్‌ భార్య షాకింగ్‌ కామెంట్స్‌...'చీప్ స్టార్' అంటూ వ్యాఖ్యలు...

Khiladi Controversy : మాస్ మహారాజా రవితేజపై ఖిలాడి దర్శకుడు రమేష్ వర్మ భార్య రేఖ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాఫిక్ గా మారాయి. రవితేజను (Raviteja) 'చీప్ యాక్టర్' అంటూ ఆమె షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలు ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood)లో పెనుదుమారమే రేపుతున్నాయి. రవితేజ నటించిన 'ఖిలాడీ' (khiladi) మూవీ ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మూవీ రిలీజ్ కు ముందే హీరోకు, దర్శకుడికి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. 

ఇటీవల ‘'ఖిలాడి'’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రవితేజ మాట్లాడుతూ...నిర్మాత సత్యన్నారాయణను ఉద్దేశించి ఖిలాడీ సినిమాకు సంబంధించి మీరే దగ్గరుండి అన్ని విషయాలు చూసుకోవాల్సిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతకు ముందు రమేష్‌ వర్మపై (Director Ramesh varma) సంచలన వ్యాఖ్యలు చేశాడు. దర్శకుడు మహర్జాతకుడని, సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాతతో కారు కూడా కొనిపించుకున్నాడంటూ సైటిరికల్‌గా కామెంట్స్ చేశాడు. రచయిత శ్రీకాంత్ విస్సా కారణంగానే ఖిలాడి సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు చెప్పాడు రవితేజ. 

అయితే రవితేజ కామెంట్స్ చూస్తుంటే వారిద్దరి మధ్య బాగానే కోల్డ్ వార్ నడిచినట్లు తెలుస్తోంది. తాజాగా రమేష్ వర్మ భార్య చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి. ఆమె తన స్టోరీలో ‘గతంలో దర్శకుడు అజయ్ భూపతి ఆర్టీని 'చీప్‌ స్టార్‌' అని ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైంది’ అంటూ రేఖవర్మ పోస్ట్ చేశారు. రేఖావర్మ వ్యాఖ్యలపై రవితేజ ఎలా స్పందిస్తాడనేది ఆసక్తిగా మారింది. గతంలో రవితేజ, రమేశ్‌ వర్మలు కాంబోలో 'వీరా' మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. 

Also Read: SVP Song Leak: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన తమన్.. తనవల్ల కావట్లేదంటూ ఎమోషనల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News