సుశాంత్ సింహ్ రాజ్ పుత్ ( Sushant singh rajput ) మరణ వ్యవహారం నుంచి ఫైరవుతున్న కంగనా రనౌత్ మరోసారి నిప్పులు చెరిగింది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అతన్నించి అవార్డు వెనక్కి తీసుకోవాలని కోరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కంగనా రనౌత్ ( Kangana Ranaut ) కు వివాదాస్పద వ్యాఖ్యల అలవాటే. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ( producer karan johar ) పై ఆమె మరోసారి విరుచుకుపడింది. సుశాంత్ సింహ్ మరణ వ్యవహారంలో ఇప్పటికే కరణ్ ను ఇరుకునపెడుతూ తీవ్ర ఆరోపణలు చేసింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు కరణ్ జోహారే కారణమని కంగనా ఆరోపించింది. ఈ వ్యవహారం నిన్నటివరకూ సంచలనంగానే ఉంది. ఇప్పుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.  కరణ్ జోహార్..పద్మశ్రీ పురస్కారానికి ( padma sri award ) అనర్హుడని..కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియా సాక్షిగా కోరింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది.



కరణ్ జోహార్ పద్మశ్రీ అవార్డును తిరిగి తీసుకోవాలని నేను భారత ప్రభుత్వాన్నిఅభ్యర్దిస్తున్నాను. అతను నన్ను అంతర్జాతీయ వేదికపై పరిశ్రమ వదిలిపోవల్సిందిగా బెదిరించాడు. యువ హీరో సుశాంత్ కెరీర్ ( Sushant career ) ను దెబ్బతీసేందుకు కుట్ర పన్నాడు. ఉరి చిత్ర వివాద సమయంలో పాకిస్తాన్ కు మద్దతిచ్చారు. ఇప్పుడు భారత సైన్యాన్ని అవమానపర్చే విధంగా యాంటీ నేషనల్ చిత్రం నిర్మిస్తున్నారంటూ కంగనా రనౌత్ ట్వీట్ చేసి సంచలనం సృష్టిస్తోంది.