Kannada Hero Puneeth Rajkumar Death LIVE Updates Puneeth Rajkumar and Ashwini Revanth love story: కన్నడ పవర్‌ స్టార్‌ (kannada power star) పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో కన్నుమూయడం ఇప్పుడు అందరినీ కలచి వేస్తోంది. ఫిట్‌నెస్‌కు ప్రిపరెన్స్ ఇచ్చే హీరో ఇలా అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) దాతృత్వం, మంచితనం ఇలా ఎన్నో విషయాల గురించే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో పునీత్ రాజ్‌కుమార్ లవ్‌ స్టోరీ (love story) కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పునీత్ రాజ్‌కుమార్ ఆయన భార్య అశ్విని రేవంత్‌ (Ashwini Revanth) ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఒకరినొకరు కలుసుకున్నారు. వారి బంధం మొదట స్నేహంగా మొదలై తర్వాత ప్రేమగా మారింది. ఎనిమిది నెలల స్నేహం తరువాత పునీత్‌ అశ్విని రేవంత్‌కు ప్రపోజ్ చేశారు. ఆమె వెంటనే అంగీకరించింది. అయితే వీరి ప్రేమకు కొన్ని అడ్డంకులూ, అభ్యంతరాలూ వచ్చాయి. వీరి పెళ్లికి పునీత్ కుటుంబం (Puneet family) సంతోషంగా ఒప్పుకున్నా, అశ్విని కుటుంబం (Ashwini family) అంగీకరించలేదు. ఆరు నెలల తర్వాత ఎట్టకేలకు అశ్విని కుటుంబం ఆమోదం తెలిపింది.


Also Read : T10 League 2021 Coaches: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. పురుషుల జట్టుకు మహిళా కోచ్


అలా ఓపిగ్గా పెద్ద వారిని ఒప్పంచి పునీత్ రాజ్‌కుమార్, అశ్విని రేవంత్‌ పెళ్లి చేసుకున్నారు. 1999న డిసెంబర్ ఒకటిన పునీత్ రాజ్‌కుమార్, అశ్విని రేవంత్ వివాహం జరిగింది. వీరికి దృతి, వందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక అశ్విని 1981లో కర్నాటకలోని బెంగళూరులో (Bangalore) జన్మించారు. ప్రస్తుతం ఆమె శాండిల్‌వుడ్‌లో (Sandalwood) ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నారు. అనేక సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా కూడా అశ్విని పని చేశారు.


2019లో పునీత్‌ ప్రొడ్యూస్‌ చేసిన కవల్‌దారి మూవీని ప్రెజంటర్‌గా వ్యవహరించారు. వీరిద్దరూ పీఆర్‌కే ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబి నేషన్‌లో ఒక మూవీ ప్రీ-‍ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. సజావుగా సాగిపోతున్న పునీత్ రాజ్‌కుమార్, (Puneeth Rajkumar) అశ్విని రేవంత్ కాపురాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో. పునీత్‌ అర్థాంతరంగా ఈ లోకాన్ని వీడారు.


Also Read : Rajinikanth Health Update : రజనీకాంత్‌ మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌, హెల్త్ బులిటెన్‌ విడుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook