Chiranjeevi Other Celebs Mourn: పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతిపై చిరంజీవితో పాటు టాలీవుడ్ నటుల దిగ్భ్రాంతి

Chiranjeevi and other tollywood celebrities expresses shock about Puneet Rajkumar's death : పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణ వార్త విన్న సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అన్ని భాషల సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2021, 05:42 PM IST
  • పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణంతో విషాదఛాయలు
  • అప్పూ మరణం తీరని లోటు అని ఆవేదన చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు
  • టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రముఖుల సంతాపం
Chiranjeevi Other Celebs Mourn: పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతిపై చిరంజీవితో పాటు టాలీవుడ్ నటుల దిగ్భ్రాంతి

Kannada Hero Puneeth Rajkumar Death LIVE Updates Chiranjeevi and other tollywood celebrities mourn sudden demise: కన్నడ కంఠీరవుడు రాజ్‌కుమార్‌ కుమారుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణంతో శాండిల్‌వుడ్‌ శోక సంద్రంలో మునిగింది. ఇతర సినీ పరిశ్రమల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణ వార్త విన్న సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అన్ని భాషల సినీ ప్రముఖులతో (Cine celebrities) పాటు, రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు.

తన హృదయం ముక్కలైందని.. పునీత్‌ రాజ్‌కుమార్‌ (Puneeth Rajkumar) ఇంత త్వరగా మనల్ని వదలి వెళ్లారనే వార్త విస్మయానికి గురి చేసిందని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఆవేదన వ్యక్తం చేశారు. 

అప్పూ మృతితో గొప్ప స్నేహితుడ్ని కోల్పోయాను అని నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పేర్కొన్నారు. ఆయన మృతి కన్నడ చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు బాలయ్య బాబు. 

భగవంతుడు కొన్నిసార్లు ఇలా ఎందుకు చేస్తాడో అర్థం కాదని మోహన్ బాబు బాధపడ్డారు.పునీత్‌ రాజ్‌కుమార్‌ (Puneeth Rajkumar) చాలా మంచి మనిషి అని కొనియాడారు. యావత్‌ సినీ ప్రపంచానికి ఇది విషాదకరమైన రోజు అని పేర్కొన్నారు మోహన్‌ బాబు. (Mohan‌ Babu)

పునీత్‌ రాజ్‌కుమార్‌ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని నాగార్జున (Nagarjuna) పేర్కొన్నారు.

పునీత్‌ రాజ్‌కుమార్‌ తుదిశ్వాస విడిచారనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఆవేదన వ్యక్తం చేశారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నానన్నారు.

పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇక లేరనే వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మహేశ్‌బాబు (Maheshbabu) అన్నారు. తాను కలిసిన.. మాట్లాడిన గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరని కొనియాడారు.

Also Read : Puneeth Rajkumar Death : కంఠీరవం స్టేడియానికి పునీత్‌ రాజ్‌కుమార్‌ పార్థీవ దేహం
పునీత్‌ రాజ్‌కుమార్ కల్మషం లేని వ్యక్తి అని రామ్‌ చరణ్‌ (Ram Charan) పేర్కొన్నారు. నటనతోనే కాకుండా తన వ్యక్తిత్వంతో ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారన్నారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలిపారు చెర్రీ. 

తన హృదయం బద్దలైందని జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr. NTR) పేర్కొన్నారు. మమ్మల్ని వదిలి మీరు ఇంత త్వరగా వెళ్లిపోయారనే విషయాన్ని నమ్మలేకపోతున్నా అని ఆవేదన వ్యక్తం చేశారు.

హృదయం ముక్కలైంది... పునీత్‌ రాజ్‌కుమార్‌ (Puneeth Rajkumar) అన్నా అంటూ మంచు మనోజ్‌ (Manoj) బాధను వెల్లబుచ్చారు.

పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణ వార్తతో షాక్‌కు గురయ్యానని, వారి కుటుంబానికి, అభిమానులకు నా సంతాపం తెలియజేస్తున్నా అని వరుణ్‌ తేజ్‌ (Varun Tej) పేర్కొన్నారు.

పునీత్‌ రాజ్‌కుమార్‌ పవర్‌ఫుల్‌ నటుడని.. తన నటనతో కొన్ని లక్షల హృదయాల్ని గెలుచుకున్నారని బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ (boney kapoor) పేర్కొన్నారు. అలాంటి ఆయన మరణ వార్త షాక్‌కి గురిచేసిందన్నారు.

తాను చూసిన గొప్ప వ్యక్తుల్లో పునీత్‌ రాజ్‌కుమార్‌ ఒకరని ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండేవారని ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాని నటుడు రామ్‌ పోతినేని (Ram Potineni) పేర్కొన్నారు.

పునీత్‌ రాజ్‌కుమార్‌ లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నాని పూజా హెగ్డే (Pooja Hegde) పేర్కొన్నారు. ఆయన మరణం భారతీయ చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు.

పునీత్‌ ఆకస్మిక మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై (karnataka cm basavaraj bommai) తెలిపారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ (అప్పూ) మరణం కన్నడ చిత్రసీమకు, కర్ణాటకకు తీరని లోటని పేర్కొన్నారు. 

పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆకస్మిక మరణం తనను షాక్‌కి గురిచేసిందని కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప (Former Karnataka CM Yediyurappa) అన్నారు. చిన్న వయస్సులోనే మనందరినీ వదిలి వెళ్లిపోవడం కలిచివేస్తోందన్నారు.

Also Read : Puneet Rajkumar Died: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి.. శోకసంద్రంలో అభిమానులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News