kantara Movie Varaha roopam Song : కాంతారా నిర్మాతలకు దెబ్బ మీద దెబ్బ.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
Varaha roopam controversy వరహా రూపం పాటను ప్రదర్శించకూడదని ఇది వరకు సెషన్స్ కోర్టు, జిల్లా కోర్టులు తీర్పులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వాటిని సవాల్ చేస్తూ నిర్మాతలు హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే
kantara Movie Varaha roopam Song : కాంతారా సినిమాలోని వరాహారూపం సాంగ్ కాపీ అని, అది తమదేనని తైక్కుడం బ్రిడ్జ్ అనే సంస్థ కేసు వేసిన సంగతి తెలిసిందే. పాలక్కడ్ జిల్లా కోర్టు, కోజికోడ్ జిల్లా కోర్టులో ఈ మేరకు పిటీషన్లు దాఖలయ్యాయి. దీంతో కాంతారా సినిమా నుంచి వరాహారూపం పాటను ప్రదర్శించడం ఆపేశారన్న సంగతి తెలిసిందే. జిల్లా కోర్టులు ఇచ్చిన తీర్పును సవాట్ చేస్తూ హోంబలే సంస్థ కేరళ కోర్టును సంప్రదించింది. అయితే కేరళ హై కోర్టు మాత్రం హోంబలే నిర్మాతల ముందు చేతులెత్తేసింది. కింది కోర్టులోనే చూసుకోండి.. అవి ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోమంటూ మొట్టికాయలు వేస్తూ పిటీషన్‌ను కొట్టివేసింది.
హోంబలే ఫిల్మ్స్ వర్సెస్ మాతృభూమి ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ లిమిటిడ్ మధ్య జరిగిన ఈ కేసులో చివరకు నిర్మాతలకే షాక్ తగిలింది. వరాహారూపం సాంగ్ ఇకపై ఓటీటీలోనూ కనిపించదని అర్థమవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఆల్రెడీ ఈ వీడియోను తీసేసినట్టు కనిపిస్తోంది. కింది కోర్టులోనే తేల్చుకోండి అంటూ నిర్మాతలకు హై కోర్టు సూచించడంతో ఈ కేసు ఇప్పట్లో తేలేట్టుగా కనిపించడం లేదు. ఇప్పటికైతే ఈ పాట లేకుండా సినిమాను ప్రదర్శిస్తున్నారు.
థైక్కుడం బ్రిడ్జ్ నవరసం అంటూ క్రియేట్ చేసిన ఆల్బమ్‌ను మేకర్లు వరాహారూపంగా మార్చేసి కాపీ కొట్టారనేది ప్రధాన ఆరోపణ. మరి ఈ కేసు ఎప్పటికి తేలుతుందో.. కాంతారా చుట్టూ ఉన్న ఈ చిక్కులన్నీ ఎప్పుడు వీడుతాయో చూడాలి.
కాంతారా సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. కన్నడలోనే రెండు వందల కోట్ల వరకు రాబట్టేసినట్టు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం నాలుగు వందల కోట్లను కొల్లగొట్టేసింది. లాభాల విషయంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ కంటే కాంతారా వంద రెట్ల ముందుంటుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Also Read : Manchu Vishnu Birthday : లేటుగా విష్ చేశాడట.. వెన్నెల కిషోర్ మీద మంచు విష్ణు ఫైర్.. నెటిజన్ల ట్రోలింగ్
Also Read : Shriya Saran lip lock : ఇది కామన్ ఏముంది అందులో.. బహిరంగంగా లిప్ లాక్ ట్రోలింగ్‌పై శ్రియా రియాక్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook