Darshan Case: కన్నడలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న దర్శన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. సినిమాలతో కాకపోయినా.. ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదాలలో ఇరుక్కుంటూ అందరికీ షాక్ ఇస్తూ ఉంటారు దర్శన్. అయితే తాజాగా ఇప్పుడు దర్శన్ ఒక హత్య కేసులో ఇరుక్కుని.. కన్నడ ఇండస్ట్రీ మొత్తానికి భారీ షాక్ ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రేణుక స్వామి అనే వ్యక్తిని కన్నడ సూపర్ స్టార్ దర్శన్.. కావాలని హత్య చేశారని ఇప్పుడు కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళితే గత కొంతకాలంగా దర్శన్ దాంపత్య జీవితం వివాదాస్పదంగానే సాగుతుంది. దర్శన్ కి నటి పవిత్ర గౌడతో అక్రమ సంబంధం.. ఉంది అని ఈ మధ్యనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. 


మరొకవైపు దర్శన్ కి వీరాభిమాని అయిన రేణుక స్వామి తన అభిమాన హీరో భార్యకు అన్యాయం చేయడం బాగోలేదు.. అంటూ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పవిత్ర గౌడ తీరుని కూడా తప్పుపట్టారు. ఆమెకు అసభ్యకరమైన మెసేజ్ లు కూడా పంపిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. 


దర్శన్ కూడా ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరిగి కొద్ది రోజులు కూడా కాకముందే రేణుక స్వామి కనిపించకుండా పోయారు. అతనిపై మిస్సింగ్ కేసు కూడా నమోదయింది. అతని కోసం మైసూర్ పోలీసులు గాలిస్తూ ఉండగా సున్నహళ్లి బ్రిడ్జి దగ్గర అతని మృతదేహం కనిపించింది. మొదట ఆత్మహత్య అని అనుకున్నప్పటికీ తర్వాత ఇది కచ్చితంగా హత్య అని పోలీసులు నిర్ధారించారు. 


ఈ హత్యతో దర్శన్ కి కూడా సంబంధం ఉంది అని, అతని మీద పగతో దర్శన్ కొంతమంది గుండాలకు సుపారీ ఇచ్చి రేణుక స్వామిని హత్య చేయించారు అని ఆరోపణలు వచ్చాయి. 


చిత్రదుర్గ నగర్ వాస్తవ్యుడైన రేణుక స్వామి ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నారు. గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి.. ఒక ప్రైవేట్ మెడికల్ షాప్ లో పనిచేస్తూ ఉన్నారు. అతని మరణ వార్త శాండల్ వుడ్ మొత్తాన్ని షాక్ కి గురిచేసింది. ఇంకా బాధాకరమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. చనిపోయిన రేణుక స్వామి భార్య ఐదు నెలల గర్భవతి అని తెలుస్తుంది. ఈ మధ్యనే పెళ్లి చేసుకుని, త్వరలో తల్లి కాబోతున్న రేణుక స్వామి భార్య పరిస్థితి ఇప్పుడు హృదయ విదారకంగా మారింది.


Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..


Read more: Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter