Vedha Release Date కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ నటించిన వేద సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఆ సినిమాను ఇప్పుడు తెలుగులో వేదగా డబ్ చేస్తున్నారు. శివ రాజ్ కుమార్ కెరీర్‌లో 125వ సినిమా తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు మేకర్లు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్‌, మోషన్ పోస్టర్ ఇలా అన్నీ కూడా సినిమా మీద బజ్‌ను పెంచేశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శివ రాజ్‌కుమార్‌కు ఇది 125వ చిత్రం మాత్రమే కాకుండా.. అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ అయిన అతని హోమ్ బ్యానర్‌లో ఇది మొదటి వెంచర్‌ అవడం కూడా విశేషమే.  కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి మాట్లాడుతూ.. ఈ సినిమా ఫస్ట్ లుక్ కి అలానే మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపాడు. 


ఈ సినిమా ఫిబ్రవరి 9న గ్రాండ్ గా తెలుగులో రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించాడు. ఈ సినిమాను కథ నచ్చి కొనుక్కున్నానని, ఒక మంచి సినిమాకి ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు బహ్మరథం పడతారనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు.కానీ నాకు అవకాశం దక్కిందని చెప్పుకొచ్చాడు.  


ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ  యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో డిసెంబర్ 23న విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ మరియు అనేక మంది నటించిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 9న  తెలుగులో రాబోతోంది.


Also Read:  Samantha Russo brothers : నువ్ నాకు దొరకడం నా అదృష్టం.. సమంత పోస్ట్ వైరల్


Also Read: Aha Twitter DP : దెబ్బకు డీపి కూడా మార్చేశారు.. పవన్ కళ్యాణ్‌ కోసం ఆహా అనేలా ప్రమోషన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook