Samantha Russo brothers : నువ్ నాకు దొరకడం నా అదృష్టం.. సమంత పోస్ట్ వైరల్

Samantha Russo brothers సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డీకే, రూసో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ వెబ్ సిరీస్‌ సిటాడెల్‌ షూటింగ్ సెట్‌లోకి అడుగుపెట్టేసింది. ఈ క్రమంలో సమంతకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు రూసో బ్రదర్స్.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2023, 12:39 PM IST
  • సెట్‌లోకి అడుగుపెట్టిన సమంత
  • రూసో బ్రదర్స్ వెబ్ సిరీస్‌లో సామ్
  • రాహుల్ రవీంద్రన్‌ ట్వీట్ వైరల్
Samantha Russo brothers : నువ్ నాకు దొరకడం నా అదృష్టం.. సమంత పోస్ట్ వైరల్

Samantha Russo brothers సమంత ప్రస్తుతం పాన్ ఇండియన్ వెబ్ సిరీస్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ మెన్ సిరీస్‌తో రాజ్ అండ్ డీకేలకు ఇంటర్నేషనల్ వైడ్‌గా ఫేమస్ అయ్యారు. రెండో పార్టులో అయితే రాజ్ అండ్ డీకేలు సమంత చేసిన యాక్షన్‌కు ఫిదా అయ్యారు. అందుకే ఆమెతో సపరేట్‌గా ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేశారు. వరుణ్‌ ధావన్ సమంతలు కలిసి సిటాడెల్ అనే స్పై వెబ్ సిరీస్‌ను చేస్తున్నారు. దీన్ని రూసో బ్రదర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే ఈ వెబ్ సిరీస్‌ షూటింగ్ కోసం సమంత గత ఏడాది డేట్లు అడ్జస్ట్ చేసింది. కానీ మయోసైటిస్ కారణంగా సమంత ఇంట్లోంచి బయటకు రాలేకపోయింది. సమంత ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే ఇలా బయటకు వస్తోంది. సెట్స్ మీదకు యాక్షన్ చేసేందుకు రెడీ అయింది. ఈక్రమంలోనే రూసో బ్రదర్స్ ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

 

దీనిపై రాహుల్ రవీంద్రన్ పోస్ట్ వేశాడు.. చూశారా?.. సమంత రేంజ్.. ఎక్కడి నుంచి ఏ స్థాయి వరకు వెళ్లిందో.. రూసో బ్రదర్స్ వంటి వారు సమంతకు స్వాగతం పలికారు.. ఆమె మనల్ని తలెత్తుకునేలా చేస్తోందంటూ ఇలా రాహుల్ రవీంద్రన్ పోస్ట్ వేశాడు. ఈ ట్వీట్ మీద సమంత స్పందించింది. నీ లాంటి ఫ్రెండ్ నాకు దొరకడం నా అదృష్టం అని సమంత చెప్పుకొచ్చింది.

ఇక రాహుల్ ట్వీట్ మీద చిన్మయి రియాక్ట్ అయింది. సమంత క్వీన్ అంతే.. అంటూ చెప్పుకొచ్చింది. నువ్వే క్వీన్‌ అని చిన్మయికి సమంత రిప్లై ఇచ్చింది. ఇలా చిన్మయి, సమంత, రాహుల్ రవీంద్రన్‌ త్రయం ముచ్చట్లు, ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Samantha Apologies : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు సమంత క్షమాపణలు.. రౌడీ హీరో ఏమన్నాడంటే?

Also Read: Pragya Jaiswal Bikini : బికినీలో బాలయ్య భామ.. జలకాలాటలో ప్రగ్యా జైస్వాల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News