Vedha Telugu Movie Review మాస్ సినిమాలకు ఇప్పుడు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది కన్నడ పరిశ్రమ. మాస్‌కు కొత్త అర్థాన్ని ఇచ్చారు కన్నడ మేకర్లు. ఇప్పుడు అదే కోవలో వేద అనే సినిమాను తీశారు. కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ నటించిన 125వ సినిమాగా వచ్చిన వేద ఆల్రెడీ కన్నడ అభిమానులను మెప్పించింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ రూపంలో వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది ఓ సారి చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథ
వేద కథ అంతా కూడా 1985, 65వ ప్రాంతంలో జరుగుతుంది. వేద (శివ రాజ కుమార్) కుమార్తె కనక (అదితి సాగర్) కారాగారం నుంచి విడుదలవుతుంది. ఆ తరువాత వేద, కనక కలిసి పోలీస్ ఆఫీసర్ రుద్ర(భరత్ సాగర్)ను అతి కిరాతకంగా చంపుతారు. అదే వరుసలో నాలుగు హత్యలు చేస్తారు. వేద, కనకలు చేసే హత్యలను పోలీస్ అధికారి రమా కనిపెడుతూనే ఉంటుంది. అసలు వేద, కనకలు ఇలా అందరినీ ఎందుకు చంపుకుంటూ పోతారు? వేద భార్య పుష్ఫ (గానవి లక్ష్మణ్)కు ఏం జరిగింది? కనన జైల్లో ఎందుకు ఉంటుంది? ఈ కథలో వేశ్య (శ్వేతా చంగప్ప) పాత్ర ఏంటి? అనేది థియేటర్లో చూడాల్సిందే.


నటీనటులు
వేద కథలో శివ రాజ్ కుమార్‌ ఎంతో ఇంటెన్స్‌తో కనిపించారు. డైలాగ్స్ తక్కువగా ఉన్నా.. ఎమోషన్ మాత్రంఎక్కువగా ఉంటుంది. ఎమోషనల్ పాత్రలో శివ రాజ్ కుమార్ తన అనుభవాన్ని చూపించాడు. ఇక ఈ సినిమాకు ఎక్కువ మార్కులు వేయాల్సి వస్తే అది కనక, పుష్ప పాత్రలకే వేయాలి. ఈ ఇద్దరూ తమ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆడియెన్స్‌ను కట్టి పడేస్తారు. విలన్లుగా నటించిన వారు కూడా అద్భుతంగా నటించేశారు. మిగిలిన పాత్రలన్నీ కూడా ఆడియెన్స్‌కు రిజిస్టర్ అవుతాయి.


విశ్లేషణ
వేద సినిమా కథ మనకు తెలియంది కాదు. కానీ దానికి ఎంచుకున్న నేపథ్యం, తీసిన తీరు కొత్తగా అనిపిస్తుంది. కేజీయఫ్ మాయలోంచి ఇంకా కన్నడ పరిశ్రమకు బయటకు రాలేదని వేదను చూస్తే అర్థం అవుతుంది. వేద సినిమా స్క్రీన్ ప్లే, మేకింగ్ అంతా కూడా కేజీయఫ్‌ను ఫాలో అయినట్టుగా కనిపిస్తుంది.


అయిదే వేద సినిమాలో ఎంచుకున్న థీమ్ వేరు. మహిళల మీద జరిగే అన్యాయాలు, అఘాయిత్యాలను చూపించాడు. ఆడదాన్ని అలుసుగా తీసుకుని, అనుభవించాలని చూసే మగ మృగాలను నరికి పారేయాల్సిందే అని వేద చేత సందేశాన్ని ఇప్పించారు. రేప్‌లు చేసి జైల్లో కూర్చుంటే చేసిన తప్పుకు శిక్ష పడుతుంది. కానీ బాధితురాలు, వారి కుటుంబం మాత్రం జీవితాంతం క్షోభను అనుభవిస్తూనే ఉంటారు అని చెప్పిన డైలాగ్‌లు అద్భుతంగా ఉన్నాయి.


వేద కథ అందరికీ తెలిసిందే కావడం మైనస్. అయితే ఈ కథను చాలా స్లోగా సాగదీసి చెప్పినట్టుగా అనిపిస్తుంది. దీంతో ప్రేక్షకుడు కాస్త అసహనానికి లోనవుతాడు. సరిగ్గా అలాంటి సమయంలోనే ఏదో ఒక ఎలివేషన్ సీన్ పెట్టి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మెప్పించేశారు. ఎలివేషన్ షాట్స్, కనక పుష్ప పాత్రలకు యాక్షన్ సీక్వెన్స్‌లో పెట్టిన ఫ్రేమ్స్ చూస్తే ఎవ్వరైనా సరే ఆహా అనాల్సిందే.


అలా వేద సినిమాకు విజువల్స్, ఆర్ఆర్ ప్రాణంగా నిలిచాయి. సాంకేతికంగా ఈ సినిమా అద్భుతం అనిపిస్తుంది. కథ, కథనాలు పర్వాలేదనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.


రేటింగ్ : 3 


బాటమ్ లైన్ : వేద.. తప్పు చేసిన వారికి తప్పదు వధ!


Also Read:  Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే


Also Read: SSMB 28 Look : మహేష్‌ బాబు లెటెస్ట్ లుక్.. మరింత తగ్గిపోయాడే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి