Kannada Star Upendra Wife Priyanka బెంగాలీ నటిగా ప్రియాంక త్రివేది ఎన్నో మంచి చిత్రాల్లో నటించింది. బెంగాలీ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన ప్రియాంక.. చివరకు కన్నడ స్టార్ ఉపేంద్రను వివాహాం చేసుకుంది. వివాహం తర్వాత ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే డిటెక్టివ్ తీక్షణ అనే సినిమాను చేశారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ రఘు దర్శకత్వం వహించారు. గుత్తముని ప్రసన్న, జి ముని వెంకట్ చరణ్ ( ఈవెంట్ లింక్స్, బెంగళూర్), పురుషోత్తం బి (ఎస్ డి సి) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇరవై ఏళ్లకు పైగా సుదీర్ఘమైన కెరీర్ తనకు దక్కినందుకు తాను అదృష్టవంతురాలిని అని ప్రియాంక చెప్పుకొచ్చింది. పదహారో ఏట మిస్ కలకత్తాగా ఎన్నికైన తాను బెంగాలీ చిత్రంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించానని చెప్పుకొచ్చింది. 1999 నుంచి 2003 వరకు చాలా తక్కువ సమయంలోనే బెంగాలీ, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, ఒడియా సినిమాల్లో ఎన్నో చిత్రాలు నటించానని చెప్పుకొచ్చింది


ఆ తరువాత వివాహం, పిల్లలు... జీవితం ఇలా మలుపు తిరిగిందని, తాను మళ్ళీ నటిస్తానని అనుకోలేదని తెలిపింది. పిల్లలు పుట్టాక కూడా తనకు 8 బెంగాలీ సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయని తెలిపింది. కానీ పిల్లలతో కోల్ కతాకి వెళ్లి వర్క్ చేయలేకపోయానని తెలిపింది. ఇది తన కెరీర్‌కు 50వ సినిమా అని, దర్శకుడు రఘు చాలా హార్డ్ వర్కింగ్ అండ్ ప్యాషనేట్ అని పొగిడేసింది. 


ఒక లైన్ చెప్పినప్పుడే తాను ఇంప్రెస్స్ అయినట్టుగా, ఇలాంటి ప్రధాన పాత్ర ఇంతక ముందు ఎప్పుడూ ఒక మహిళ చేయలేదని తెలిపింది. ఇది ప్రధానంగా ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫిల్మ్ అని సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎంటర్టైన్ అవడమే కాకుండా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కూడా లోనవుతారని చెప్పుకొచ్చింది.


డిటెక్టివ్ తీక్షణ త్వరలో విడుదల కాబోతోందని ఆ తరువాత లైనప్‌లో కర్త కర్మ క్రియ, విశ్వరూపిణి, గుల్లిగమ్మ, ఖైమరతో పాటూ మరో బెంగాలీ ఫిలిం మాస్టర్ అన్షుమన్ కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది. వైరస్, కమరట్టు చెక్ పోస్ట్ - 2, ఉగ్ర అవతారా చిత్రాలు కూడా రిలీజ్‌కు రెడీగా ఉన్నాయని చెప్పుకొచ్చింది.


Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?


Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook