Kannappa: కన్నప్ప సినిమాలో మరో స్టార్ హీరోయిన్.. రోజు రోజుకు పెరుగుతున్న స్టార్స్ లిస్ట్..
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. అంతేకాదు ఈ సినిమా కోసం భారీ క్యాస్టింగ్‌ను కూడా రంగంలోకి దింపుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి నటులు ఈ భారీ ప్రాజెక్ట్‌లో ఉన్నారు. తాజాగా ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ నటిస్తుందనే వార్త్ వైరల్ అవుతోంది.
Kannappa: ఒక్క హిట్టు.. ఒకే ఒక్క హిట్టు కోసం మంచు విష్ణు ముఖం వాచిపోయేలా ఎదురు చూస్తున్నాడు. ఈ కోవలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్యాన్ ఇండియా స్టార్స్‌ను రంగంలోకి దింపుతున్నాడు. తెలుగు నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండంతో కన్నప్పపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. మరోవైపు ఈ సినిమాలో బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఈయన మహా దేవుడి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. రీసెంట్‌గా 'ఓ మై గాడ్ 2'లో పరమేశ్వరుడి పాత్రలో మెప్పించిన అక్షయ్ కుమార్ ఈ సినిమాలో అదే పాత్రలో నటిస్తారా లేదా అనేది చూడాలి.
మరోవైపు ప్రభాస్ కూడా మహా శివుడి పాత్రలో నటిస్తున్నట్టు అప్పట్లో మంచు విష్ణు హర్ హర్ మహదేవా అంటూ ట్వీట్ చేసాడు. దీంతో ఈ సినిమాలో ప్రభాస్ ఏ క్యారెక్టర్ చేస్తాడో చూడాలి. మరోవైపు ఈ సినిమాలో పార్వతి మాత పాత్రలో ముందుగా నయనతారను అనుకున్నారు. మరోవైపు కంగనా, అనుష్క శెట్టి పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో కాజల్ అగర్వాల్ నటించబోతున్నట్టు సమాచారం.
ఈమె ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తుందో చూడాలి.
ఈ సినిమాలో కన్నప్పతో శివుడు ద్వంద్వ యుద్ధ ఘట్టం ఉంది. ఈ సినిమాలో ఇదే హైలెట్ సీన్. ఈ సినిమాను రూ. 100 కోట్ల బడ్టెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్ & 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయిమాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్రానికి కథకు మెరుగులు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాటు మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, వంటి హీరోలు కూడా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
గతంలో ప్రభాస్.. ప్రభుదేవా దర్శకత్వంలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన 'యాక్షన్ జాక్సన్'లో కెమియో రోల్ చేసారు. అది ఓపెనింగ్స్‌కు పెద్దగా ఉపయోగాపడలేదు. ఇపుడు చాలా యేళ్ల తర్వాత కన్నప్ప సినిమాలో ప్రభాస్ అతిథి పాత్ర చేస్తున్నారు. ప్రభాస్ గెస్ట్ రోల్ 'కన్నప్ప' మూవీకి ఓపెనింగ్స్ తెచ్చిపెడతాయా లేదా అనేది చూడాలి. ఏది ఏమైనా ప్రభాస్ రాకతో 'కన్పప్ప' రేంజే మారిపోయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook