Sai Pallavi Dance: షీలా.. షీలా కి జవానీ పాటకు మెస్మరైజింగ్ స్టెప్పులు వేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్..

Sai Pallavi Dance: నేచురల్ బ్యూటీ సాయిపల్లవీ తన డ్యాన్స్ తో మరోసారి రచ్చ చేశారు. ఆమె కాలేజీ రోజుల్లో షీలా.. షీలాకీ జవానీ పాటపై చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వావ్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.   

Written by - Inamdar Paresh | Last Updated : Apr 17, 2024, 04:10 PM IST
  • కత్రీనా కైఫ్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు..
  • సాయిపల్లవీ పర్ఫామెన్స్ కు నెటిజన్లు ఫిదా..
Sai Pallavi Dance: షీలా.. షీలా కి  జవానీ పాటకు మెస్మరైజింగ్ స్టెప్పులు వేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్..

Sai Pallavi Dance On Katrina Kaifs Sheila ki jawani Song: నేచురల్ బ్యూటీ సాయిపల్లవికి ఉన్న ఫాలోయింగ్ , క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ తమిళ భామ.. ఒకవైపు మూవీస్ లో హీరోయిన్ గా చేస్తునే, మరోవైపు జార్జియాలో తన ఎంబీబీఎస్ కూడా పూర్తి చేసి అందరికి ఆశ్చర్యానికి గురిచేసింది. సాయిపల్లవి సినిమాల విషయంలో ఎంతో సెలక్టిడ్ గా ఉంటారు. తనకు నచ్చితేనే కొన్ని క్యారెక్టర్ లను చేస్తారు. సినిమాల్లో కూడా మంచి మెస్సెజ్ ఓరియెంటెడ్ తన పాత్రకు, ఎక్స్ ట్రా హైప్ వచ్చే సినిమాలను ఎక్కువగా చేస్తుంటారు. సాయిపల్లవీ తీసిన సినిమాలన్ని ఎంతో నేచురల్ నటనతో ఉంటాయి. ఆమె డబ్బులు వస్తాయని ఎక్స్ పోజింగ్ లు చేయడం కానీఅస్సలు చేయరు. తన నటనతో , డ్యాన్స్ లతో అందరిని ఫిదా అయ్యేలా చేశారు. తరచుగా సాయి పల్లవీ డ్యాన్స్ చేస్తున్న అనేకవీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి.

 

తాజాగా, సాయి పల్లవీ తన కాలేజ్ డేస్ లలో.. షీలా.. షీలాకీ జవానీపాటకు మెస్మరైజింగ్ స్టెప్పులు వేశారు. ఈవీడియోలో సాయిపల్లవీ అచ్చం కరీనా కపూర్ లా మాస్ స్టెప్పులు వేశారు. అంతే కాకుండా.. పక్కనున్న వారిని పూర్తిగా తన డ్యాన్స్ తో డామినెట్ చేస్తున్నారు. స్టార్ తీస్ మార్ ఖాన్ చిత్రం నుండి షీలా కి జవానీ ట్రాక్‌కి డ్యాన్స్ చేయడం ఈ వీడియోలో చూడవచ్చు. 2010లో విడుదలైన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ,  కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలు పోషించారు. వైరల్ వీడియోలో సాయి పల్లవి తన మాస్ డ్యాన్స్ తో అక్కడున్న వారిని షాక్ కు గురిచేసింది.

హిట్ సాంగ్ కు అచ్చం కత్రినా కైఫ్ మాదిరిగా అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఇదిలా ఉండగా.. సాయిపల్లవి “#సాయిపల్లవి తన కాలేజ్ ఫెస్ట్‌లో షీలా కి జవానీ పాటలో షేర్ చేసింది. సాయి పల్లవి డ్యాన్స్ వీడియో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. జనవరిలో, ఆమె సోదరి, పూజా కన్నన్ నిశ్చితార్థం జరిగింది. ఆవేడుకలో కూడా..  సాయి పల్లవి క్రీమ్,  పసుపు చీరను ధరించి ఓహ్-సో-స్టనింగ్ గా కనిపించింది. తన ఫ్యాన్ పేజీ షేర్ చేసిన వీడియోలో, నటి తన కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్స్ చేయడం వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సాయిపల్లవి తమిళంలో రామయణం మూవీలో సీత దేవీ పాత్రలో కన్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నాడు.

Read More: Romance In Flight: విమానంలో కపుల్ అరాచకం.. 4 గంటల పాటు హగ్గింగ్ చేసుకుంటూ రొమాన్స్.. వైరగా మారిన ఘటన..

దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామిని నటి వివాహం చేసుకున్నట్లు పేర్కొంటూ సాయి పల్లవి ఫోటో వైరల్‌గా మారింది. వివిధ సోషల్ మీడియా పేజీలు మరియు ఫ్యాన్ క్లబ్‌లు వారి మెడలో దండలతో ఉన్న ఫోటోను పంచుకున్నారు. రాజ్ కుమార్, సాయిపల్లవిలు వివాహం చేసుకున్నారని పలు సోషల్ మీడియా వార్తలు వైరల్ గా మారాయి. దీన్నిసాయిపల్లవి ఖండించారు. ఇది ఒక సినిమాలో భాగంగా చేసిన పూజకార్యక్రమమంటూ ఆ తర్వా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News