Rishab Shetty Touches Rajinikanth Feet : సూపర్ స్టార్ రజినీకాంత్ తనకు నచ్చిన సినిమాను వెంటనే ప్రశంసిస్తాడు. ఈ క్రమంలో కాంతారా సినిమాను వీక్షించిన తలైవా.. వెంటనే ట్వీట్లు వేశాడు. సినిమాను తీసిన విధానం చూసి రోమాలు నిక్కబొడుచుకున్నాయంటూ పొగిడేశాడు. దర్శకుడిగా, నటుడిగా రిషభ్ శెట్టి అదరగొట్టేశాడని అన్నాడు. మీలాంటి లెజెండ్ నటులు మా సినిమాను పొగడటం ఆనందంగా ఉందంటూ రజినీ ప్రశంసలపై రిషభ్ శెట్టి మురిసిపోయాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇప్పుడు రిషభ్ శెట్టి ఏకంగా.. రజినీకాంత్ ఇంటికి వెళ్లాడు. మర్యాదపూర్వకంగా కలిశాడు. కాళ్లు మొక్కేశాడు. కాంతారా సినిమా గురించి సుదీర్ఘంగా చర్చించారు. కాంతారా సినిమా మీద రజినీకాంత్ ఎన్నో విషయాలు చెబుతుంటే.. రిషభ్ శెట్టి అలా చూస్తుండిపోయినట్టు కనిపిస్తోంది. ఇక మీరు మా సినిమాను ఒక్కసారిగా పొగిడితే.. మిమ్మల్ని వందసార్లు పొగుడుతాం అన్నట్టుగా రిషభ్ శెట్టి్ ట్వీట్ వేశాడు.


 



ప్రస్తుతం వీరిద్దరి కలయికకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి. కన్నడ సినిమాకు దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఈ కాంతారా సినిమా ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. హిందీ మార్కెట్లో అయితే ఇప్పటికే ఇరవై కోట్ల షేర్ రాబట్టేసింది. తెలుగులోనూ దగ్గరదగ్గరగా ఇరవై కోట్ల షేర్ వచ్చింది. తమిళంలోనూ ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.


దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు ఇప్పటికే రెండొందల కోట్లు వచ్చేశాయి. పదిహేను కోట్లతో తెరకెక్కించిన కాంతారా సినిమా ఇప్పుడు దేశ వ్యాప్తంగా రెండొందల కోట్ల షేర్ రాబట్టడంతో అందరూ షాక్ అవుతున్నారు. అత్యధిక లాభాలు తెచ్చిన సినిమాగా కాంతారా నిలిచిపోయింది. ఇక ఐఎండీబీ ర్యాంకింగ్స్‌లో అయితే కాంతారా సినిమా నెంబర్ వన్ స్థానంలోకి వచ్చేసింది.


Also Read :Anasuya Bharadwaj Food : నేను బాగా తింటున్నా.. కొవ్వు పెరుగుతోంది కానీ.. అనసూయ కామెంట్స్ వైరల్


Also Read :  Swara Bhaskar Trolls : నీకు ఇంతకంటే పెద్దది కావాలా?.. స్వర భాస్కర్ కౌంటర్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook