Kantara OTT streaming date : కన్నడలో రూపొందిన కాంతార సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి స్వయంగా రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయనే హీరోగా నటించారు. ఆయన సరసన సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని కేజిఎఫ్ సినిమాతో కన్నడ సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేవలం 16 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ సినిమా తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా 250 కోట్ల కలెక్షన్లు మార్కు దాటేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికి రెండు వందల నలభై మూడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా రేపటి లోపు 250 కోట్ల గ్రాస్ టచ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా నవంబర్ 5వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 


Kantara on Amazon Prime: ఈ నేపథ్యంలో హోంబలే ఫిలింస్ సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తీక్ గౌడ స్పందిస్తూ అది నిజం కాదని త్వరలోనే ఓటిటి రిలీజ్ డేట్ తామే ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. పైకి ఆయన అలా చెబుతున్నారు కానీ వాస్తవానికి ఈ సినిమాని నవంబర్ 5వ తేదీ నుంచి స్ట్రీమ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ కి అమ్ముతున్న సమయంలోనే ఐదు వారాల తర్వాత రిలీజ్ చేసుకునే విధంగా ఒప్పందం చేసుకున్నారు.


అయితే సినిమా యావరేజ్ గా ఆడితే వారు అన్నట్లుగానే ఐదు వారాల గడువు సరిపోయేది. కానీ ఈ సినిమా అసలు పోటీ అనేది లేకుండా అన్ని భాషల్లో ముందుకు దూసుకు వెళ్లి పోతున్న నేపథ్యంలో ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయడం అంత మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతానికి సినిమా యూనిట్ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాని విడుదల చేయకుండా ఉండడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, అమెజాన్ ప్రైమ్ వీడియోతో సంస్థ సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది.ఈ సినిమాని తెలుగులో అల్లు అరవింద్ కు చెందిన గీత సంస్థ రెండు కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా ఇప్పటికే సినిమా దాదాపుగా 10 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసింది.


Also Read: Varasudu: వారసుడు తెలుగు సినిమా కాదట.. దిల్ రాజుకు ముందుంది ముసళ్ళ పండుగ!


Also Read: Sunny Leone Remuneration : దారుణంగా జిన్నా కలెక్షన్స్.. సన్నీ లియోన్ రెమ్యూనరేషన్ కూడా రికవరీ కాలేదట!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook