Rishabh Shetty Ram Charan: అల్లు అరవింద్ మాస్టర్ స్కెచ్.. మెగా హీరోతో రిషబ్ పాన్ ఇండియా మూవీ?
Kantara Rishabh Shetty to direct Ram Charan: కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి డైరెక్షన్లో రామ్ చరణ్ తో ఒక ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Kantara Rishabh Shetty to direct Ram Charan: కన్నడ సినిమా కాంతార అద్భుతమైన టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమాని కేవలం కన్నడ భాషలోనే విడుదల చేశారు, కానీ అక్కడ ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి హిందీ, తెలుగు భాషలలో కూడా విడుదల చేశారు. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం చేసిన ఈ సినిమా అద్భుతమైన టాక్ తో దూసుకెళ్లడమే కాక తెలుగులో కూడా అద్భుతమైన వసూళ్లు కురిపిస్తోంది.
ఈ సినిమాని తెలుగులో గీత ఆర్ట్ సంస్థ బ్యానర్ మీద అల్లు అరవింద్ విడుదల చేశారు విడుదల చేస్తున్నప్పుడే ఈ సినిమా పుష్ప కంటే బాగుంటుందని కచ్చితంగా సూపర్ హిట్ కొడుతుందని అల్లు అరవింద్ ఆశాభావం వ్యక్తం చేయగా అదే నిజమైంది. సప్తమి గౌడ హీరోయిన్గా నటించిన ఈ సినిమాని విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద నిర్మించారు. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ రిసెప్షన్ తర్వాత సినిమా తెలుగులో ఉంటుందని ప్రకటించారు.
గీతా ఆర్ట్స్ సంస్థ ద్వారా ఆయన ఒక ప్రాజెక్టు చేస్తున్నారని కూడా అల్లు అరవింద్ ప్రకటించారు. అయితే ఆయన అలా ప్రకటించిన వెంటనే అందరూ రిషబ్ శెట్టి హీరోగా సినిమా చేస్తారేమో అనుకున్నారు కానీ తాజాగా మరో ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. అదేమంటే రిషబ్ శెట్టి వద్ద ఒక ఆసక్తికరమైన లైన్ ఉందని ఆ లైన్ తో సినిమా చేయాలంటే అది అల్లు అరవింద్ లాంటి బడా ప్రొడ్యూసర్లకే సాధ్యమవుతుందని అంటున్నారు. కాంతార సినిమాతో బాగా ఇంప్రెస్ అయిన అల్లు అరవింద్ రిషబ్ శెట్టితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారని, తనకు తన దగ్గర ఉన్న లైన్ కి రాంచరణ్ అయితే కరెక్ట్ గా సూట్ అవుతాడు అనే రిషబ్ శెట్టి చెప్పడంతో రాంచరణ్ కే ఆ కథ చెప్పించడానికి అల్లు అరవింద్ సిద్ధమయ్యారని అంటున్నారు.
ప్రస్తుతానికి రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన నేపథ్యంలో రామ్ చరణ్ జపాన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే రిషబ్ శెట్టితో కథ నేరేట్ చేయించి అంతా ఓకే అనుకుంటే త్వరలోనే సెట్స్ మీదకు కూడా తీసుకువెళ్లడానికి అల్లు అరవింద్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు మెగా ఫ్యామిలీకి- అల్లు ఫ్యామిలీకి దూరం పెరిగింది అంటూ జరుగుతున్న ప్రచారానికి కూడా ఈ స్టెప్ తో బ్రేకులు వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
Also Read: RRR Naatu Naatu Step: నాటు నాటు సాంగ్ కు కాలు కదిపిన జపనీస్ యూట్యూబర్..ఏమి గ్రేస్ అయ్యా?
Also Read: Prabhas Fans : ప్రభాస్ ఫాన్స్ అత్యుత్సాహం.. థియేటర్లో అగ్నిప్రమాదం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook