Rapid fire with Balakrishna: ఆరు పదుల వయసులో కూడా.. తన సూపర్ ఎనర్జీతో ఆకట్టుకుంటున్నారు బాలకృష్ణ. ఈ మధ్యనే బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీ ఆ ఫంక్షన్ ని ఎంతో అంగరంగ వైభవంగా జరిపిన సంగతి తెలిసిందే. కాగా తెలుగు ఇండస్ట్రీ తో పాటు ఐఫా అవార్డుల్లో సైతం.. బాలకృష్ణకి అరుదైన గౌరవం దక్కింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐఫా అవార్డులు ఈ మధ్యనే దుబాయిలో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ అవార్డుల ఫంక్షన్ కి.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, ఐశ్వర్యారాయ్ లాంటివారు అటెండ్ అయ్యారు. ఈ క్రమంలో బాలకృష్ణకి లెగసి అవార్డు ఇచ్చి సత్కరించారు. ఈ ఫంక్షన్లో ఐశ్వర్యారాయ్ కి కూడా అవార్డు రాగా.. ఆ అవార్డుని ఈ హీరోయిన్ బాలకృష్ణ చేతులు మీదగా తీసుకోవడం విశేషం. ముఖ్యంగా ఐశ్వర్యారాయ్ అవార్డు తీసుకునే ముందు బాలకృష్ణ కాళ్ళు మొక్కింది. అంత పెద్ద హీరోయిన్ అయినా కానీ.. పెద్దలను గౌరవించి బాలయ్య కాళ్లు మొక్కడంతో.. అభిమానులు ఈ ప్రపంచ సుందరిని తెగ పొగిడేస్తున్నారు. 


ఇక ఈ అవార్డుల తరువాత.. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.. బాలయ్యతో రాపిడ్ ఫైర్ నరిపాడు. ఇందులో భాగంగా.. కరణ్ అడిగిన ప్రశ్నలు దానికి బాలయ్య చెప్పిన సమాధానాలు అందరిని ఆకట్టుకున్నాయి. మరి ఆ ప్రశ్నలు, జవాబులేవో ఒకసారి చూద్దాం..


కరణ్: 'జై బాలయ్య' అనడం మీరు మొదటిసారి ఎప్పుడు విన్నారు?


బాలకృష్ణ: మీకు అభిమన్యుడి కథ తెలుసా? అతనిలానే నేను కూడా అమ్మ ఒడిలో ఉన్నప్పుడే జై బాలయ్య అని విన్నాను.


కరణ్: మీ టాక్ షోలో మీకు అస్సలు నచ్చని అతిథి ఎవరు? 


బాలకృష్ణ: వారు నా షోకి వచ్చే వరకు.. కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు. కానీ నా షోకి రాగానే నాతో చేరి వాడు కూడా బెస్ట్ అయిపోతారు. 


కరణ్ : ఈ క్షణంలో నాతో సహా అందరూ మీ గురించి  భయపడుతున్నారు? ఇలా ఎందుకంటారు? 


బాలకృష్ణ: వాళ్లందరూ నన్ను ప్రేమిస్తారు. కానీ కొన్నిసార్లు కొంతమంది మాత్రం నన్ను విసిగిస్తూ ఉంటారు. వారికి మాత్రమే నేను కొన్నిసార్లు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంటాను! 


కరణ్: చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లో మీకు ఇష్టమైనవారు ఎవరు?


బాలకృష్ణ: మీకు ఖాన్స్ లో ఎవరు ఇష్టం..?


కరణ్: నేను ఈ స్థానంలో ఉన్నదానికి.. కారణమైన షారుక్ ఖాన్ ఇష్టం. ఇప్పుడు చెప్పండి మీకు ఎవరు ఇష్టం..?


బాలకృష్ణ: వాళ్లు ముగ్గురు కూడా లెజెండ్స్ 


కాగా ఈ ప్రశ్నలు, జవాబులు తర్వాత బాలకృష్ణ కరణ్ కోసం ఒక సీనియర్ ఎన్టీఆర్ సాంగ్ కూడా పాడారు. అంతేకాకుండా తాను ఈ వయసులో కూడా మూడు వరస హిట్స్ ఇచ్చానని.. అలానే తాను చేస్తున్న అన్ష్టాపబుల్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉండే పాపులర్ షోస్ లో 18 వ స్థానంలో ఉందని.. సగర్వంగా చెప్పుకొచ్చారు బాలయ్య. ఇందుకు సంబంధించిన వీడియోలు‌‌.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Read more: Hydra Victims: నీ అయ్య జాగీరా ఎవడ్రా నువ్వు మా ఇల్లు కూలగొట్టేది.. హైడ్రా వర్సెస్ మూసీ బాధితులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.