Karate Kalyani on Ram Gopal Varma : శ్రీకాంత్ రెడ్డి ట్రీట్మెంట్ వర్మకు కూడా ఇస్తానంటున్న కరాటే కళ్యాణి
Karate Kalyani Fires on Ram Gopal Varma : ఎన్డీఏ పక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఝార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము గురించి రామ్ గోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. ఈ విషయం మీద కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Karate Kalyani Fires on Ram Gopal Varma : చేసిన మొదటి సినిమా 'శివ'తోనే సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మాత్రం ఎక్కువగా వివాదాలకు పరిమితమవుతున్నారు. చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు కూడా డిజాస్టర్లు అవుతూ రావడంతో ఆయన ఎక్కువగా వివాదాస్పద సినిమాలు చేస్తూ తద్వారా వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తనకు సంబంధం లేని విషయంలో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్డీఏ పక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఝార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము గురించి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు..
ద్రౌపది ముర్ము ఎన్డీఏ పక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఉంటారని ప్రకటన వచ్చిన తర్వాత వర్మ ద్రౌపది సరే పాండవులు, కౌరవులు ఎవరు అంటూ ప్రశ్నించారు. ఈ విషయం మీద బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు బీజేపీ నేతలు వర్మ మీద ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేశారు. ఒక గిరిజన ఆడ బిడ్డ మీద ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు అంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే తమకు ఫిర్యాదు అందిందని ఈ విషయం మీద కేసు ఎలా నమోదు చేయాలి అనే విషయం మీద లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు.
విషయం సీరియస్ అవ్వడంతో వర్మ ఈ విషయం మీద స్పందించారు. తాను వేరే ఉద్దేశంతో ఆమె మీద అలాంటి కామెంట్స్ చేయలేదని మహాభారతం మొత్తం మీద తనకు ద్రౌపది పాత్ర అంటే చాలా ఇష్టమని అలాంటి అరుదైన పేరు పెట్టుకున్న ఆమె వల్ల ఆ పత్రాలు గుర్తు వచ్చి సరదాగా కామెంట్ చేశాను తప్ప ఎలాంటి దురుద్దేశాలు లేవంటూ పేర్కొన్నారు. అయితే వర్మ చేసిన కామెంట్లు మీద బీజేపీ నేతల నుంచి పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురుస్తోంది. రాజాసింగ్ ఈ విషయమై ఇప్పటికే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక వివాదాస్పద నటి బీజేపీ నేత కరాటే కళ్యాణి కూడా రామ్ గోపాల్ వర్మ మీద ఘాటు కామెంట్స్ చేశారు.
''భావి భారత రాష్ట్రపతి గారిని ఇంత అవమానకరంగా కామెంట్ చేస్తాడా వీడు?..(ఒకప్పుడు ఇతనికి గౌరవము ఇవ్వాలి అనిపించేది ఇప్పుడు.ఇవ్వడం దంగడ అనిపించి ఇలా పెడుతున్నా) దేశ నాయకుల మీద ఇలా నోరు పారేసుకున్న వీడికి తగిన శిక్ష పడాల్సిందే.. మొన్న జరిగిన ట్రీట్మెంట్ ఈడు కనిపిస్తే....ఇలాగే మాట్లాడితే ఈడికి ఇవ్వాలి అని మీరు అంటే మీ కామెంట్స్ లో తెలియజేయండి'' అంటూ పేర్కొన్నారు. అంటే మొన్నీమధ్యనే శ్రీకాంత్ రెడ్డి అనే యూట్యూబర్ మీద దాడి చేసినట్టు దాడి చేయాలని మీరంటే కామెంట్ చేయమని పేర్కొంది. దానికి ఒక నెటిజన్ ఇలా అయిన దాంట్లో కానీ దాంట్లో దూరితే ట్రీట్మెంట్ వికటించి ఏదో ఒకరోజు నీకు బిస్కెట్ అవుతుందని అంటే ''ఒక మహిళని అంటే నేను వెళ్తా అందులో దేశంలో అత్యున్నత స్థానంలో ఉండబోతున్న మహిళని అంటే ఊరుకోను .నీకు వికటించకుందా చూసుకో ముందు'' అంటూ ఆమె పేర్కొన్నారు.
Also Read: Pawan Kalyan With Sai Dharam Tej : మెగా ఫ్యాన్స్ కి మరో ఫీస్ట్.. మేనల్లుడితో పవన్ సినిమా ప్రారంభం!
Also Read: Naresh - Pavitra Lokesh : పెళ్లి వార్తల నేపథ్యంలో భర్త అలాంటి వాడంటూ పవిత్ర లోకేష్ కామెంట్స్ వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.