Japan Movie ott release date: తమిళ్ స్టార్ హీరో కార్తీ (Karthi) రీసెంట్ గా జపాన్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. నవంబరు 10న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. కార్తీ క్యారెక్టరైజేషన్‌ కొత్తగా ఉన్నప్పటికీ కథ, కథనాల్లో లోపాలు ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. యాక్షన్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్‌ (Anu Emmanuel) హీరోయిన్ గా నటించింది. రాజమురుగన్‌ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను లాక్ చేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం డిసెంబరు 11వ తేదీ నుంచి నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమా తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ మూవీని డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాశ్‌ బాబు, ఎస్‌ ప్రభు నిర్మించాడు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించాడు. రూ.200 కోట్ల విలువ చేసే న‌గ‌లు ఎవరు దొంగతనం చేశారు? అసలు జపాన్ ఎవరు? అతడు ఎందుకు దొంగగా మారాడు? సంజు, జపాన్  మధ్య సంబంధం ఏంటి? తెలియాంటే ఈ సినిమా చూడాల్సిందే. థియేటర్లలో మిస్ అయినా వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 



Also Read: Abhiram Daggubati: దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. సురేష్ బాబు ఇంట మొదలైన సంబరాలు


త‌మిళం కంటే తెలుగులో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో కార్తీ ఒకరు. ఇతడు నటించిన చిత్రాలు కోలీవుడ్ లో కంటే తెలుగులోనే బాగా ఆడాయి. ఆవారా, యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఊపిరి, ఖైదీ, పొన్నియన్ సెల్వన్, సర్ధార్ చిత్రాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కార్తీ యెుక్క 25వ చిత్రం జపాన్ కావడం విశేషం. 


Also Read: Animal Movie Box office: బాక్సాఫీస్ వ‌ద్ద‌ ‘'యానిమ‌ల్’' ప్రభంజనం...మూడు రోజుల్లోనే రూ.350 కోట్లు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook