Atharva Movie Success Meet: క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో క్లూస్ టీమ్ ప్రాధాన్యతను తెరపై చూపిస్తూ రూపొందిన మూవీ 'అథర్వ'. మహేష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరాలు హీరో హీరోయిన్లుగా నటించారు. పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మించారు. డిసెంబర్ 1న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా.. పాజిటివ్‌ టాక్‌తో ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో శనివారం అథర్వ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ.. అథర్వ మూవీకి ఫుల్ పాజిటివ్ రిపోర్టులు వచ్చాయని.. చాలా చోట్ల హౌజ్ ఫుల్స్ కనిపించాయని చెప్పారు. మొదటి రోజే ఇంత మంచి ఆదరణ రావడంతో తాము పడిన కష్టాన్ని మర్చిపోయాన్నారు. ఏ ఒక్కరూ సినిమా బాగోలేదని చెప్పలేదని.. మంచి సినిమాను తీశామని మెచ్చుకుంటున్నారని అన్నారు. తమ సినిమాను ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. గగన్ విహారి మాట్లాడుతూ.. క్లూస్ టీం మీద మహేష్ రెడ్డి చాలా రీసెర్చ్ చేసి.. ఈ పాయింట్‌కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని ఊహించారని అన్నారు.  ఈ మూవీ క్లైమాక్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని.. ఆడియన్స్ నుంచి ఇంత ఆదరణ రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 


దర్శకుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమాల మీద ప్యాషన్‌తో యూకే నుంచి ఇక్కడి వచ్చానని.. డైరెక్టర్‌గా తెరపై తన పేరు చూసుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ మూవీని తీసి రిలీజ్ చేయడం.. ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లి వారి ప్రేమను దక్కించుకోవడం మామూలు విషయం కాదన్నారు. ఇదంతా టీమ్ సమష్టి కృష్టి వల్లే జరిగిందని చెప్పారు. కొత్త పాయింట్, కొత్త కథ చెబితే ప్రేక్షకులు ఆదరిస్తారని తనకు నమ్మకం ఉందన్నారు. అందుకే క్లూస్ టీమ్ మీద సినిమాను తీసినట్లు చెప్పుకొచ్చారు. కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి చాలా బాగా నటించారని అందరూ అంటున్నారని.. సారా పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. శ్రీ చరణ్ పాకాల అందించిన పాటలు, ఆర్ఆర్ సినిమాకు ప్రాణం పోశాయన్నారు. 


అథర్వ మూవీలో తాను జర్నలిస్ట్ పాత్రను పోషించానని హీరోయిన్ సిమ్రన్ చౌదరి తెలిపారు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని.. ఇలాంటి గ్రిప్పింగ్ సినిమాను చాలా రోజుల తరువాత చూశామని చెబుతున్నారని చెప్పారు. ఇలాంటి కొత్త జానర్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. 


Also Read:  Michaung Cyclone: తుపాను ప్రభావం తీవ్రమే, అతి భారీ వర్షాల హెచ్చరిక, ప్రభుత్వం అలర్ట్


Also Read:  Diabetic Care in Winter: శీతాకాలంలో మధుమేహం వ్యాధిగ్రస్థులకు తస్మాత్ జాగ్రత్త


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి