Karthika Deepam 2: ఆదిశక్తిలా మారి వీధి రౌడీని చితకబాదిన దీప.. జీతాలు ఇవ్వలేని స్థితిలో జ్యోత్స్న గ్రూప్స్, కార్తీక్ లాకెట్ కథ అదిరిపోయింది..
Karthika Deepam 2 January 2nd Episode: టిఫిన్ చేసి ఆ వీధిరౌడీ డబ్బులు ఇవ్వకుండా పోతుంటాడు.దీప డబ్బు అడుగుతుంది. ఈ ఏరియా మనదే నేను ఎవరో తెలీదా? ఏరియాకు కొత్తా? నన్ను ఎవరూ డబ్బులు ఇప్పటి వరకు అడగలేదు అంటాడు. అవేందుకు ఏదో బతుకుదెరువు కోసం టిఫిన్ సెంటర్ నడుపుతున్నాం డబ్బులు ఇవ్వు అంటుంది.
Karthika Deepam 2 January 2nd Episode: దీప డబ్బులు ఇచ్చి వెళ్లండన్నా అంటుంది. బాసు డబ్బు ఇచ్చి వెళితే గొడవ ఉండదు కదా అంటాడు కార్తీక్. బండి పడేసి నాలుగు ముక్కలు చేస్తా అని లాగుతాడు దీంతో దీప శివంగిలా మారుతుంది. ఆ రౌడీ చేయి పట్టకుంటుంది. ఆఖరిసారి అడుగుతున్న డబ్బులు ఇస్తావా లేదా? అంటే ఇవ్వనే అంటాడు దీంతో దీప వాన్ని చితక్కొడుతుంది. పక్కనే కార్తీక్ బాబు చూస్తూ ఉండిపోతాడు. పోనిలే ఈ వేధవతో నాకేందుకు అనుకున్నా.. అన్ని పీకలదాక తిని డబ్బులు ఇవ్వమంటే బలుపు చూపిస్తున్నావా? ఈ ఏరియా నీదా? నిన్నడిగి టిఫిన్ బండీ పెట్టాలా? ఆకలి వేస్తుంది అని అడుగు పోనిలే అని పెడతా? అని వాచ్ లాక్కుంటుంది దీప. అక్క మాస్ యాంగిల్ గురించి ముందే చెప్పాలి కదా గురూ అని ఆ రౌడీ కార్తీక్‌తో అంటాడు. నేను ముందే చెప్పా నువ్వే వినలేదు. ఇక కాంచన కూడా దీపలో ఇంత కోపం ఉందా? ఉండాలిలే ఆడవారికి ఆదిశక్తి లాంటి కోపం అనుకుంటుంది.
కార్తీక్ మరోవైపు నువ్వు మరీ నచ్చుతున్నావ్. నీలో ఆకాశమంత సహనం, ఆదిశక్తిలాంటి కోసం ఉంది అంటాడు కార్తీక్. మరోవైపు ఆఫీసులో జో చిరాకుగా ఉంటుంది. జీతాలు కూడా ఇవ్వలేదని పీఏ చెబుతాడు. బిజినెస్ డల్‌గా ఉంది అంటాడు. నేను సీఈఓ అయితే బిజినెస్ డల్ అయితే నా వల్లే కదా.. తాతతో మాట్లాడి ఈ సమస్య సాల్వ్ చేయాలి అనుకుంటుంది.
ఇక కాంచన, దీప, కార్తీక్‌లు ఈరోజు డబ్బు లెక్కపెడతారు. కార్తీక్ నావాటా సగం కావాలి అంటాడు. ఎందుకు ఇద్దరూ ఒక్కటే కదా అంటుంది కాంచన. మీరు చేయండమ్మా అంటుంది దీప. నాకు ప్రతిరోజూ లాభంలో నా సగం నాకు కావాలి అని జేబులో పెట్టుకుని వెళ్తాడు. బెడ్‌రూమ్‌లోకి వెళ్లి కార్తీక్ శౌర్య కోసం దాచిపెడతాడు. పాప ఆరోగ్యం విషయంలో ఎలాటి ఇబ్బంది రాకుండా డబ్బు ఇలా సేవ్ చేస్తున్నా అని దాచిపెడతాడు. అప్పుడే కబోర్డు నుంచి లాకెట్ కింద పడుతుంది. చూడకుండా వెళ్లిపోతాడు కార్తీక్. శౌర్య చూస్తుంది. ఇదేంటి లాకెట్ ఇక్కడ ఉంది. నాన్న పారేసుకున్నారేమో నాకు దొరికింది కాబట్టి నాదే అని దాచి పెడుతుంది శౌర్య. దీప అప్పుడే చూస్తుంది.
నన్ను చూసి చెయ్యి ఎందుకు వెనక్కిపెట్టావు అంటుంది దీప. కార్తీక్ చూస్తే తీసుకుంటాడు ఇవ్వనమ్మా అంటుంది. ఆరోజు నువ్వు అడిగిందే కదా.. ఇలా ఇవ్వు అని చేతిలో నుంచి లాక్కుంటుంది.దీన్ని నేను కార్తీక్ బాబు ఇస్తా. ఒకరు ఇష్టంతో దాచిపెడితే వాటితో ఆడుకోవద్దు. నాకు దొరికింది నాది అంటుంది శౌర్య. మనది కాని వస్తువును మనం తీసుకకోకూడదు అంటుంది దీప. ఇంతలా ఇష్టపడటానికి ఇందులో ఏముంది? అని చూస్తుంది దీప. దీన్ని ఎక్కడో చూసినట్లుందే అని లాకెట్ ను చూస్తుంది. చిన్నప్పుడు తన నాన్న అమ్మ జ్ఞాపకంగా వేసిన విషం గుర్తుకు వస్తుంది దీపకు కానీ, అది ఒక అబ్బాయి నీళ్లో పడిపోతే కాపాడాడు అని చెప్పా కదా ఇచ్చాను నాన్న అంటుంది దీప ఆ విషయం గుర్తుకు వస్తుంది.
చీకటిపడుతుంది కార్తీక్ ఆ లాకెట్ కోసం కబోర్డులో వెతుకుతుంటాడు. అప్పుడే వస్తుంది దీప. ఏంటి కార్తీక్ బాబు వెతుకుతున్నారు అంటుంది, ఏంలేదు దీప అంటాడు. మళ్లీ వెతుకుతుంటాడు అప్పుడు దీప తన దగ్గర ఉన్న లాకెట్ చూపించి దీనికోసమేనా బాబు మీరు వెతుకుతుంది అంటుంది. కార్తీక్ వెంటనే చూస్తాడు. దీనికోసమేదీప అంటాడు. ఇది నీదగ్గరకు ఎలా వచ్చింది అంటుంది. నా ఫ్రెండ్‌ది అంటాడు, ఎవరా ఫ్రెండ్ అంటుంది. అది పెద్ద కథలే నీకు పని ఉంటుంది తర్వాత చెబుతా అంటాడు. అసలు మీరు దీన్ని ఎందుకు ఇంతలా దాచిపెడుతున్నారు తెలుసుకోవాలని అడుగుతున్నా అంటుంది. ఈ లాకెట్ ఎలా వచ్చింది అంటుంది
ఇదీ చదవండి : మగవాళ్లు 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా పెళ్లి చేసుకోకుంటే ఈ సమస్య నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు..
ఇన్నిరోజులు ఎందుకు చెప్పలేదు అంటే మనస్సు విప్పి మాట్లాడే దగ్గరి తనంలో లేవు అందుకే చెప్పలేదు దీప. మన మధ్య ఉన్న గీతను చెరపడానికి రెండు చేతులు కావాలి నీ చేతులు సిద్ధంగా లేవు. నా అడుగులు ముందు పడుతున్నా, నీ అడుగులు ముందుకు పడటం లేదు అంటాడు. రెండు అక్షరాలు కలిస్తేనే ఒకటవుతాయి. అమ్మ, నాన్న, భార్య, భర్త ఏదైనా రెండు ఒకటి కావాలి అంటాడు కార్తీక్. మనం మాత్రం ఇద్దరు ఒంటరివాళ్లం మన మధ్య ఉన్న గోడ కూలగొట్టే ప్రయత్నం నేను చేయలేదు, అందుకే నీతో ఏం చెప్పాలన్నా కొన్ని మాటలు గుండె దాటి రాలేదు, ఇది కూడా అలాంటిదే. చెప్పుకునే సమయం వచ్చింది ఈ లాకెట్ కథ నీకు తెలియాలి అంటాడు. ఏంటి బాబు కథ అంటుంది. ప్రాణం పోసిన కథ నా చిన్నతనంలో మారుమూల పల్లేటూరుకు మా అత్త గ్రామదేవత గుడికి తీసుకెళ్లింద అక్కడ జ్యోత్స్న కలువూలు కావాలంది. నీళ్లంటే భయం తనకోసం పూలు కోస్తుంటే జారీ నీళ్లలోకి పడిపోయా అని చెడుతాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.