Relationship: మగవాళ్లు 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా పెళ్లి చేసుకోకుంటే ఈ సమస్య నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు..

Relationship For Men: ఈ కాలంలో బిజీ లైఫ్‌ అంటూ వయస్సు పైబడిన తర్వాత కూడా పెళ్లి చేసుకోవడంలేదు. బాధ్యతలు మీద పడటం, వారి లక్ష్యాలు, ఇతర ఇష్టాల  కారణంగా 30 ఏళ్లు పైబడిన తర్వాత కూడా యువత పెళ్లి చేసుకోడం లేదు. ముఖ్యంగా మగవారు ఆ వయస్సు దాటిన తర్వాత కూడా పెళ్లి చేసుకోకుంటే కొన్ని సమస్యలు తప్పవు..
 

1 /5

30 ఏళ్లు దాటిన మగవారు పెళ్లి చేసుకోకుంటే ఆ తర్వాత పెళ్లి చేసుకున్నా.. పిల్లలు పుట్టడం కష్టం. ఈ కాలంలో ల్యాప్‌టాప్‌ల వద్దే గంటల కొద్దీ కూర్చొని పనిచేయక తప్పదు, పైగా ఇలా వయస్సు పెరిగిన తర్వాత పెళ్లి చేసుకోవడం వల్ల సంతానోత్పత్తిపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది.  

2 /5

ఇక అందరికీ తెలిసిన విషయమే 30 ఏళ్లు దాటిన తర్వాత శారీరక ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. దీంతో అనారోగ్యానికి గురయ్యే అవకాశం లేకపోలేదు. ఇది వైవాహిక జీవితంపై కచ్చితంగా ప్రభావం ఉంటుంది.  

3 /5

సరైన సమయంలో పెళ్లి చేసుకోకపోతే లైంగిక జీవితంపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలకు కూడా దారితీస్తుంది. విడాకులు జరిగిన సందర్భాలు కూడా కోకొల్లలు..  

4 /5

అంతేకాదు 30 ఏళ్లు దాటిన తర్వాత మీకోరికలు స్థిరంగా మారతాయి. దీంతో భాగస్వామితో సర్దుకుపోవడం కూడా కష్టంగా మారుతుంది. వెరసి వైవాహిక జీవితంలో మళ్లీ గొడవలకు దారితీస్తుంది.   

5 /5

ఇది కాకుండా మీరు ఒకవేళ 35 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్నారనుకోండి. మీకు పిల్లలు ఉంటే వారికి టీనేజ్‌ వచ్చే సరికే మీరు 50 ఏళ్లు దాటిపోతారు. ఇది మీ ఆర్థిక జీవితం వారి విద్యా, ఉపాధిపై ప్రభావం చూపుతుంది.