Karthika Deepam 2 Today December 24th Episode:  అప్పుడే రౌడీ నాన్న వెళ్లిపోదాం పదా.. నాకు నచ్చలేదు అంటుంది. ఎందుకు నచ్చలేదు లోపలికి వెళ్దాం పదా అంటాడు. లోపల ఇంత బాగుంటే నచ్చలేదు అంటావ్‌ అంటాడు. శౌర్య అల్లరి చేయకు అంటుంది  దీప. నాన్నకు ఇల్లు నచ్చినప్పుడు నీకు నచ్చాలి కదా అని చెబుతాడు. అమ్మ ఆకలి వేస్తుంది ఏమైనా పెట్టమ్మ అంటుంది శౌర్య. మార్నింగ్‌ కూడా టిఫిన్‌ తక్కువ తిన్న నాకు బాగా ఆకలేస్తుంది ఏమైనా పెట్టమ్మ అంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒరేయ్‌ కార్తీక్‌ ముగ్గురు వెళ్లి ఏమైనా తినేసి రండి అంటుంది కాంచన. అందరూ వెళ్లిపోతారు. ఇక అనసూయ చెల్లెమ్మ.. కార్తీక్‌ బాబును అలా చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నా అంటుంది. కష్టాలు వచ్చినప్పుడు  తట్టుకోవాలి అంటుంది కాంచన. ఓ టిఫిన్‌ బండి దగ్గరకు వస్తారు కార్తీక్‌, దీప, శౌర్య. బాబాయ్‌ ఏమున్నాయ్‌ ? అంటాడు. మూడు ప్లేట్లు బజ్జీలు కావాలి అంటాడు. రూ.120 అయ్యాయి అంటారు. అప్పుడు వ్యాలెట్‌ ఏమైంది?అని వెతుకుతాడు. శివన్నారాయణకు వ్యాలెట్‌ అప్పుడే అప్పజెప్పుతాడు. అది గుర్తుకు వస్తుంది. ఇక వెతికితే వంద రూపాయాలు దొరుకుతాయి. అవి తీసుకుని ఫర్వలేదు బాబు అని ఇచ్చేస్తారు. రౌడీ నీకు ఎంతో ఇష్టమైన బజ్జీ అని ఇస్తాడు. 


దీప తిను అంటాడు. అప్పుడు శౌర్య నాన్న నాకు ఇంకా ఆకలి ఉంది. ఇంకా కావాలి అంటుంది. తనవద్ద ఉన్న టిఫిన్‌ ఇచ్చేస్తాడు కార్తీక్‌. మీరు తింటూ ఉండండి నేను ఫోన్‌ చేసి వస్తా అని పక్కకు వెళ్తాడు కార్తీక్‌. అప్పుడు దీప కూడా కార్తీక్‌ వద్దకు వెళ్లి అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నారా? అని ఏడుస్తుంది. కార్తీక్‌గారు ఎంతో మందికి సహాయం చేశారు. వేలకు వేలు సహాయం చేసిన మీరు ఈరోజు చేతిలో ఒక్కరూపాయి కూడా లేదు. మీకు ఆకలి లేదని శౌర్యకు అబద్ధం చెప్పారు. 


మీకు ఆకలి చంపుకోవడం తెలుసు.. నాకు పంచుకోవడం తెలుసు. కలిసి తిందాం అంటుంది దీప. నేను కూడా మిమ్మల్ని వదిలేస్తే ఎలా? కడుపు నిండుతుందో లేదో తెలీదు కానీ మనసు నిండుతుంది. నేను ఎంగిలి చేయలేదు తినండి అంటుంది. కలిసి నడుస్తున్నప్పుడు, కలిసి తిందాం అని ఒకరి ముఖం ఒకరు చూస్తూ తింటూ ఉంటారు.


ఇదీ చదవండి:  కళావతి శాసనం.. కొంపముంచిన స్వప్న, శాంత రీఎంట్రి మాములుగా లేదుగా?


ఇక ఇంట్లో కాంచన, అనసూయలు ఇల్లు దూలిపే పనిలో పడతారు. అప్పుడే ఇంటికి క్లాప్స్‌ కొడుతూ కార్తీక్‌ నాన్న వస్తాడు. ఇలాంటి దృశ్యం చూస్తానని జీవితంలో అనుకోలేదు కాంచన అంటాడు. మొదట నేను నమ్మలేదు అంటాడు. అయితే అట్లకాడ కాల్చి పెట్టించుకునేది ఉండే అని కార్తీక్‌ వస్తాడు. ముందు ఎందుకు వచ్చారు? చెప్పండి అంటాడు. నా భార్య, కుమారుడు కష్టాల్లో ఉంటే నేనేందుకు చూడకూడదు అంటాడు. 


ఆయన వచ్చింది సొంతగా సంపాదించుకోవడానికి అండి అంటుంది దీప. ఆత్మాభిమానంతో అన్ని వదులుకుని వచ్చాడు అంటుంది దీప. విన్నావా? కావేరి ఈ మనుషుల పద్ధతి అంటాడు ముందు మనం వచ్చిన పని చూద్దామా? అంటుంది కావేరి. డబ్బులు ముందు పెడుతుంది కావేరి. ఏంటిది? అంటుంది కాంచన. కార్తీక్‌ బిజినెస్‌ వల్లనేకదా ఇదంతా జరిగింది. ఇందులో పది లక్షలు ఉన్నాయి. బిజినెస్‌ పెట్టుకోండి అంటుంది. ముందు ఇక్కడి నుంచి డబ్బు తీసెయ్‌ అని కోపగించుకుంటుంది. మీ నెత్తిమీద దరిద్రం తాండవిస్తుంది. 


ఇదీ చదవండి: కొత్త సంవత్సరం మొదటి రోజు ఈ వస్తువును చూశారంటే.. అంబానీ అంత ఎదగడం ఖాయం!  


మీ అమ్మ కూడా ఇలాగే చేసింది. మీ నాన్న నిన్ను వదిలేసినంత తేలిగ్గా నిన్ను వదులుకోను అంటాడు కార్తీక్‌ నాన్న. నేను చెప్పేది వినండి.మీరు ఇప్పుడు పేదవాళ్లు అంటాడు. అనసూయ గారు ఆ చీపురు కట్ట ఇవ్వండి అంటాడు కార్తీక్‌. రేయ్‌ మీ దుమ్ము తర్వాత దులుపుకోండి. నాలాంటి మంచివాడు తప్ప మీ ఇంటి గుమ్మం ఎవ్వడూ తొక్కడు. గతంలో అవమానించారు. మామ, కూతురు అందరి ముందు అవమానించారు. కార్తీక్‌ రెస్టారెంట్‌ పెట్టడానికి నావద్ద ఉన్నది ఇచ్చాను. కానీ ఒక షరతు. నన్ను అవమానించినందుకు సారీ చెప్పాలి. మీతో కలిసి ఉండటానికి ఒప్పుకోవాలి అప్పుడు కార్తీక్‌ పెట్టుబడి పెట్టడానికి నా వద్ద ఉన్న డబ్బు మొత్తం ఇస్తా అంటాడు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.