Brahmamudi: కళావతి శాసనం.. కొంపముంచిన స్వప్న, శాంత రీఎంట్రి మాములుగా లేదుగా?

Brahmamudi Today December 24th Episode: నేటి ఎపిసోడ్‌లో కావ్య ఆర్డర్స్‌ నచ్చక చిర్రెత్తుకు వస్తుంది ధాన్యలక్ష్మి,రుద్రాణీలకు.. మా ఆయన ఆస్తి మొత్తం ఆయన మనవరాలి పేరుపై రాశాడు. కాబట్టి మీకేం కావాలన్నా కావ్యను అడగండి. నేను కూడా కావ్యను అడుగుతా అంటుంది ఇందిరాదేవి. ఎవ్వరు ఏం అడిగినా బిల్ ఇవ్వాల్సిందేనంటుంది అపర్ణ.

Written by - Renuka Godugu | Last Updated : Dec 24, 2024, 10:17 AM IST
Brahmamudi: కళావతి శాసనం.. కొంపముంచిన స్వప్న, శాంత రీఎంట్రి మాములుగా లేదుగా?

Brahmamudi Today December 24th Episode:  ఏం కావాలన్నా కావ్య మీదే ఆధారపడి ఉండాలి అంటుంది అపర్ణ. అత్త నానమ్మే ఏం అనలేకపోయింది నేను కూడా ఏం అంటాను అత్త అంటాడు రాజ్‌. థ్యాంక్స్ అండీ మీకు మాత్రం అర్థమైంది. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్‌ ఉన్నాయా? అడుగుతుంది కావ్య. ఏం చించుకున్న ప్రయోజనం లేదని అందరూ వెళ్తిపోతారు..మరోవైపు బెడ్రూంలో రాజ్ కళావతి.. అని పిలుస్తాడు. ఎప్పుడు జాలీ, దయ కరుణ అంటావు. ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నావ్‌ రూల్స్‌ పాస్‌ చేస్తున్నావు అంటాడు. మిమ్మల్ని చూసి ఇలా స్ట్రిక్ట్‌గా రూల్ పాస్‌ చేస్తున్నా అంటుంది. ఇలా ఉంటే అందరూ నిన్న తిట్టుకుంటారు అంటాడు రాజ్‌. తాతయ్య మాట నిలబెట్టడం కోసం ఇంట్లో వారికి శత్రువులా మారిన సమస్య లేదండి అంటుంది. ఇన్నాళ్లు తాతయ్య కష్టపడ్డారు. ఇప్పుడు ఆ రూపాయి కాపాడుకోవాలి. లెక్కా పత్రం లేకుండా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడితే లాభం ఉండదు. డబ్బు విలువ తెలిసిందాన్ని కాబట్టి ఇంత జాగ్రత్త తీసుకుంటున్నా అంటుంది కావ్య.

హాల్‌లో రుద్రాణీ, ధాన్యంలు గుసగుసలాడుతుంటారు. పక్కనే ఉన్న అపర్ణ గమనిస్తుంది. అప్పుడే పనిమనిషి శాంతా వస్తుంది. ఏయ్‌.. ఆగు అక్కడ అంటుంది రుద్రాణీ. ఎందుకమ్మ వంట మనిషికి కూడా హారతి ఇచ్చి లోపలికి పిలుస్తారా అంటుంది శాంత. ఎక్కడా పని దొరక్క మళ్లీ ఇక్కడకువచ్చావా? అంటుంది రుద్రాణీ. నేనేం దిక్కులేక, పనిలేక రాలేదు, మేడం ఫోన్‌ చేస్తే వచ్చా అంటంది శాంత. నేనే పిలిచా అంటుంది కావ్య. నేను వద్దన్న పనిమనిషిని మళ్లీ పిలుస్తావా? అంటుంది. కావాలని కాదు ఈరోజు నుంచి శాంతను రమ్మాన్నా ఇంట్లో ఉండి అన్ని పనులు చేయాలంటే నాకు కుదరదు. స్టెల్లాను చూశారు కదా వాష్‌రూమ్‌ నుంచి బయలకు రాలేదు.

అమ్మమ్మగారు శాంత అయితే, వండి పెడితే తింటుంది. నా మాట అంటే ఈ ఇంట్లో విలువ లేదా? అంటుంది రుద్రాణీ. ఏయ్‌.. నువు బయటకు వెళ్లు అంటుంది రుద్రాణీ. లేదు నువ్వు లోపలికి వెళ్లు అంటుంది కావ్య. నౌకర్లను ఉంచాలన్నా తీయాలన్నా నాకే అధికారం ఉంది అంటుంది కావ్య. అమ్మమ్మను అడిగి ఏం వంట చేయాలో చేయ్‌ అంటుంది కావ్య. అలాగే అమ్మ అని వెళ్తుంది. అత్తయ్య.. ఎవరైనా బయటకు పంపించాలని చూస్తే... అది నేను చూసుకుంటా అమ్మ అంటుంది అపర్ణ. ఏంటి వదిన నాకు సపోర్ట్‌ చేయకుండా అంటుంది రుద్రాణి. నౌకర్ల దగ్గర హుందాగా నడుచుకోకపోతే ఇలాగే జరుగుతుంది. పెద్దరికాన్ని గౌరవించిన చిన్నవాళ్లను తిట్టడం ఎంత మూర్ఖత్వం అని వెళ్లిపోతుంది అపర్ణ.

రోజురోజుకు ఇంటి మీద పట్టుకోల్పోతున్న ధాన్యలక్ష్మి అది గమనించు అని రెచ్చగొడుతుంది రుద్రాణీ. మరో వైపు ఆసుపత్రిలో ఇందిరా దేవి మా ఆయన ఎప్పుడు మాములు మనిషి అవుతాడు అంటుంది. ఎప్పుడు ఏంటి అని మేం చెప్పలేం అంటాడు డాక్టర్‌. లక్షలు పోసి మేం బిల్లులు కట్టేది ఇలా చుట్టపు చూపుగా వచ్చి చూసి వెళ్లిపోవడానికేనా అంటుంది ఇందిరా దేవి. కొంచెం ఒపిక పట్టండి సర్దుకుంటుంది అని చెప్పి వెళ్లిపోతాడు డాక్టర్‌.

ఇదీ చదవండి: కొత్త సంవత్సరం మొదటి రోజు ఈ వస్తువును చూశారంటే.. అంబానీ అంత ఎదగడం ఖాయం!  

గాలిలో దీపం పెట్టి దేవుడి మీద భారంతో ఎదురు చూస్తున్న త్వరగా లే బావ అంటుంది ఇందిరా దేవి. త్వరలోనే నిన్ను చిట్టి అని ప్రేమగా పిలుస్తాడు చూడు అని కల్యాణ్‌ అంటాడు. డైనింగ్‌ టేబుల్‌ వద్ద ధాన్యం, రుద్రాణీ, రాహుల్‌లు కూర్చుంటారు ఏయ్‌ ఇడ్లీనా అంటుంది రుద్రాణీ. ఇి బ్యాన్‌ చేయాలి నాకు వద్దు అంటుంది రుద్రాణీ.ఏంటి చేనేత వస్త్రాల మేళలా ఇడ్డీలా మేళ జరుగుతుందా ? అంటుంది రుద్రాణీ. నాకు పెసరట్టు, నాకొడుక్కి గారెకావాలి తీసుకురా అంటుంది. కావ్య వస్తుంది రోజుకు నాలుగు రకాలు ఉంటాయి ఇప్పుడేంటి ఇలా అంటంది రుద్రాణీ. ఇదేమైనా హాస్ట్‌లా ఒకేరకమైన టిఫిన్‌తినడానికి అంటుంది రుద్రాణీ. మిగతావన్ని వదిలేస్తున్నారు. అన్ని చెత్తబుట్టు పాలవుతున్నాయి. ఇక నుంచి పాడు చేయడం కుదరదు. ఇన్నాళ్లు లక్షలకు లక్షలు వేస్ట్ చేశారు. డబ్బులు ఆహార పదార్థాలు దుబారా చేయడం నాకు నచ్చదు. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పినట్లు ఇడ్లీలు తినాలా? ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టుకుని తింటాం అంటుంది ధాన్యం.

ఇదీ చదవండి: జనవరి 5వ తేదీ నుంచి వారికి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు.. ఇలా వెంటనే బుక్‌ చేసుకోండి..  

పదా అని అందరూ వెళ్తారు.ఏదో కోట్లు సంపాదిస్తున్నట్లు 24 గంటలు ఏదో చేస్తుంటారు అంటుంది ధాన్యం. ఖాళీ ఉండటం దేనికి అని ట్రేడింగ్‌ చేస్తున్న అంటాడు ప్రకాశం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x