Karthika Deepam 2: హత విధీ కార్తీక్దీపలను చూసి విజిల్ వేసిన పారు.. ప్రాణదాత నేనే అని అప్పుడు చెబుతా కార్తీక్ బాబు..
Karthika Deepam 2 Today December 3 Episode: కార్తీక్ తన చిన్ననాటి లాకెట్ స్టోరీని చెబుతాడు, అది దీపే అదంతా దీపకు గుర్తు చేసుకుంటుంది. ఎర్ర రిబ్బను వేసుకుని పూలు ఉన్న గౌను వేసుకుని ఆ అమ్మాయి నన్ను కాపాడింది. నాకు ఇప్పటికీ అది గుర్తుంది. ఆ రోజు అమ్మాయి నాకు ఒక మాట చెప్పింది అంటాడు. దీప ఏడుస్తుంది అది కార్తీక్ చూడడు..
Karthika Deepam 2 Today December 3 Episode: నేను కూడా ఏదో ఒక రోజు నీకు సాయం చేస్తా అన్నాను. నేను ఎక్కడ ఉంటానో నాకు తెలీదు కదా ఎలా సాయం చేస్తావు అంది ఏమో తెలీదు అన్నాను. మళ్లీ సైకిల్ ఎక్కి వెళ్లిపోయింది. ఆ తర్వాత తెలిసింది నేను ఆ అమ్మాయి పేరు అడగడం మర్చిపోయా అని ఆతర్వాత ఆ అమ్మాయి లాకెట్ నాజేబులో ఉంది ఆ తర్వాత అర్థమైంది ఇది నా ప్రాణదాత అని అంటాడు కార్తీక్. దీప కూడా అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటుంది. ఎప్పటికైనా తన లాకెట్ తనకు ఇచ్చి అమ్మాయికి సాయం చేద్దామనుకున్నా అందుకే లాకెట్ దాచి పెట్టా. నా దురదృష్టం ఏటంటే ఇప్పటికీ ఆ అమ్మాయిని కలవలేకపోయా అంటాడు కార్తీక్. ఇది దీప ఆ లాకెట్ నా ప్రాణదాతది కాబట్టి నేను ఎవరికీ ఇవ్వలేదు, అందుకే శౌర్య అడిగితే కూడా ఇవ్వలేదు అంటాడు.
ఏంటి దీప? నా కథ చెబితే నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటావ్ అంటాడు. ఏం లేదు బాబుగారు ఎప్పుడో చిన్నప్పుడు కాపాడిన వ్యక్తిని వేసుకున్న బట్టల నుంచి బాగా చెప్పారు అంటుంది. అప్పుడు తను కాపాడింది, ఇప్పుడు నువ్వు కాపాడవు, నీ రుణం తీరింది, తన రుణం తీరలేదు అంటాడు. మనస్సులో దీప ఈ రుణం కూడా తీరింది బాబుగారు అంటుంది. ఆ దేవుడి దయ వల్ల తను మంచి పొజిషన్‌లో ఉండాలని కోరుకుంటున్నా. నా ప్రాణం తప్ప ఆమెకు ఏం అడిగినా ఇచ్చేస్తా దీప.. ఎందుకో తెలుసా? ఈ ప్రాణం నా భార్యది, అంటే నీది అంటాడు కార్తీక్. ఆ లాకెట్ దీప ఇవ్వబోతే నాన్న నాకు కావాలి అని మళ్లీ శౌర్య వస్తుంది. ఏ రౌడీ ఇది నీకు ఇవ్వను అన్నాను కదా అంటాడు సారీ రా.. ఇది నా ప్రాణదాతది. దీనికోసం తను ఏదో ఒకరోజు వస్తుంది అప్పుడు నేను ఇవ్వాలి కదా.. అంటాడు. దీంతో శౌర్య ప్రాణదాత ఎవరు? అంటుంది? అదంతా నీకు ఎందుకే నేను లాకెట్ ఇవ్వను అంటాడు కార్తీక్.
తను ఎప్పటికీ రాకపోతే అంటుంది శౌర్య. నేను ముసలోడిని అయినా సరే ఈ లాకెట్ నా దగ్గరే ఉంటుంది సరే భోజనం చేద్దాం పదా.. పదా అంటాడు. అప్పుడు దీప ఇప్పుడు నేను ఏం చేయాలి? అది నా లాకెట్ మాఅమ్మ గుర్తుగా నేను పోగొట్టుకున్నాందుకు ఎంతో బాధపడ్డా నేను కాపాడింది మిమ్మల్ని అని గుర్తుబడలేదు. అందుకే సుమిత్రమ్మను చూస్తే ఎక్కడో చూసినట్టుందమ్మా అని అడిగా, నా జీవితం నాశనం అయ్యే సరికి గుర్తు రాలేదు. లేకపోతే కార్తీక్ బాబు ఎవరో ముందే తెలిసేది. ఇప్పుడు తెలిసిందికదా ఆ మనిషి నా లాకెట్ దగ్గర పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఆ విషయం చెప్పాలా? చెప్పకపోతే ఉపయోగం ఏంటి, ఇప్పటికే పెళ్లి చేసుకుని నా కూతురుకు కూడా అండగా ఉన్నారు. ఇప్పుడు చెబితే ఇంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. అదా.. నేను కోరుకునేది మీ కుటుంబం నా కారణంగా విడిపోయింది. ఆస్తులు అన్నీ వదులు కుని ఓ నిరుపేదలా బతుకుతున్నారు. మీరు ఇలా ఉండకూడదు కార్తీక్ బాబు. మీరు గెలుస్తానని మీ తాతగారికి సవాలు చేసారు. మీరు గెలవాలి, అందరి ముందు మీరు తలెత్తుకుని ఉండాలి, అందరూ చెతులెత్తి చప్పట్లు కొట్టాలి. మీ తాతయ్య కూడా పొమ్మన్న నోటితోనే రమ్మనాలి. కార్తీక్ నామనవడు అని పదిమందికి చెప్పుకోవాలి అని అనుకుంటుంది దీప.
మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్లాలి. అలా జరిగిన రోజు మీ రెండు కుటుంబాలు కలిసిపోతాయి. మీ జీవితంలో కష్టాలుపోయి, ఆనందం చూసిన రోజు అప్పుడు చెబుతాను కార్తీక్ బాబు నేనే మీ ప్రాణదాతను అని.. చిన్నప్పుడు మీరు కోనెట్లో పడిపోయారు. ఇప్పుడు కూడా పీకల్లోతు కష్టాల్లో పడిపోయారు. అప్పుడు కాపాడాను, ఇప్పుడు కూడా కాపాడతాను అంత వరకు ఈ నిజం నాతోనే ఉంటుంది, మా అమ్మ లాకెట్ మీ దగ్గరే ఉండనివ్వండి. మనసు చాలా సంతోషంగా ఉంది, మా అమ్మ లాకెట్ దొరికింది, చిన్ననాటి స్నేహితుడు దొరికాడు. మీరు గెలవాలి కార్తీక్ బాబు, మీ గెలుపుతోనే నేను అందరికీ సమాధానం చెబుతాను అని దేవుడికి మొక్కుతుంది దీప.
ఇదీ చదవండి: మళ్లీ అదే సిచువేషన్.. పాతబంగ్లాలో కావ్యరాజ్‌ల సెకండ్ నైట్, చేతికి చిక్కిన నందగోపాల్..
మరుసటి రోజు చట్నీలు ఎప్పుడూ ఒకేవిధంగా ఉండకూడదు దీప అని ఇద్దరూ మాట్లాడుకుంటూ మార్కెట్ నుంచి వస్తుంటారు. మీరు ఆ సంచీ ఇవ్వండి బాబు. మీరు ఇలా రోడ్డు మీద నడుస్తూ వస్తున్నారు పోనీ ఆటోలో వెళ్దామా? అంటుంది దీప మీరు ఇలా నడవడం నాకే ఇబ్బంది ఉంది, మీ వాళ్లు ఎవరైనా చూస్తే అంటుంది దీప. అప్పుడే పారిజాతం కారులో నుంచి దిగి విజిల్ వేస్తుంది ఆహ..హా..హ.. ఇటువంటి సుందర దృశ్యాన్ని వీక్షించిన నా కనులు ఏమి అదృష్టం చేసుకున్నాయి. హతవిధి.. ఇది అంతయూ దరిద్ర దేవతకు అక్క, శనిదేవతకు చెల్లి అయినటువంటి దీప పాద ధూళి మహత్యమే కదా అంటుంది. నీ నాటకం ఆపి అసలు విషయం చెప్పండి అంటాడు కార్తీక్. ఇది నిజం, ఇంకా పెడచెవిన పెడితే ఇంకా దరిద్రం అనుభవించాల్సి ఉంటది పారిజాతం అంటుంది.
పారిజాతం గారు .. అంటుంది దీప నిజమేనే నువ్వు పక్కనే ఉంటే విధ్వంసం, వినాశనం అంటుంది. పారు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు అంటాడు కార్తీక్. అలా చూస్తు ఉండు ఆ దీప నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తుందో. అది పుట్టగానే తల్లిని మింగింది. పుట్టింది అదృష్టం కాదు, అరిష్టం అని పాపం వాళ్ల నాన్నకు తెలీదు, ఆయనదీ అర్థాంతరపు చావే కదా అంటుంది పారిజాతం.
ఇదీ చదవండి: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి బంపర్ గుడ్ న్యూస్.. క్యాబినెట్ మీటింగ్ భేటీలో కీలక నిర్ణయం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.