Karthika Deepam 2: జ్యోత్స్న ప్లాన్ ఫెయిల్.. సారీ చెప్పక తప్పలేదుగా, కార్తీక్‌కు జై కొట్టిన ఉద్యోగులు..
Karthika Deepam 2 Today January 9 Episode: ఈరోజు ఎపిసోడ్లో అనసూయ ఊరు నుంచి ఇంటికి వస్తుంది. కాంచన, శౌర్యలను పలకరిస్తుంది. ఎక్కడకు వెళ్లావు నానమ్మ అంటుంది శౌర్య. మన ఇల్లు శుభ్రం చేయడానికి వెళ్లా అంటుంది అనసూయ. ఈరోజు టిఫిన్ బండి పెట్టలేదు చిన్నమ్మ అంటుంది. నువ్వు వెళ్లిన పని ఏమైంది అంటుంది కాంచన.
Karthika Deepam 2 Today January 9 Episode: నా తమ్ముడు బతికి లేకున్నా కూతురుకు ఈ విధంగా సాయం చేస్తున్నాడు. కార్తీక్, దీపలు జ్యోత్స్న గ్రూప్స్ వద్దకు వెళ్లి ఉద్యోగులకు న్యాయం జరగాలి అని నినాదాలు చేస్తుంటారు. జో వెంటనే మేనేజర్‌ను పిలిచి పోలీసులకు ఫోన్ చేయమంటుంది. సారీ, మేడమ్ మీరే ఒకసారి చూడండి అంటాడు మేనేజర్. చూస్తే భయపడతాను అనుకున్నావా అని జో బయటకు వస్తుంది. కార్తీక్‌ను చూసి ఆశ్చర్యపోతుంది.కార్తీక్ ఉద్యోగులతో మీ ముందు నేనున్న మీరు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు అంటాడు. మళ్లీ సీఈఓ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తుంటారు. జో అప్పుడే ఏంటి బావ ఇది అంటుంది. దీప నువ్వు ఎందుకు వచ్చావు? అంటుంది. అయినా వినకుండా నినాదాలు చేస్తుంటారు. చూడండి మేడమ్ మేమంతా వచ్చింది ఎంప్లాయీస్ కోసం నీకోసం కాదు అంటాడు. ఈ మాజీలతో రాజీలు కుదుర్చి మళ్లీ ఉద్యోగంలో తీసుకునేందుకు వచ్చాను అంటాడు.
పగ తీర్చుకోవడానికి వచ్చావా? అంటుంది. పగ తీర్చుకోవడం కోసం నువ్వు మాట్లాడకు జ్యోత్స్న అంటుంది దీప. టిఫిన్ బండి వద్దకు ఎవర్ని పంపావు మాకు తెలుసు అంటుంది. అది నిజమైతే కంప్లెయింట్ పెట్టుకోండి అంటుంది జో. ఎంప్లాయాస్ అంటే మీ ఇంట్లో పనివారు కాదు. లా ప్రకారం కొన్ని నిబంధనలు ఉంటాయి అంటాడు కార్తీక్. అవి నాకు వర్తించవు అంటుంది జో. అవన్నీ నాకు తెలియదా? అంటుంది.నువ్వు సీఈఓ అయినప్పుడే చెప్పాను ఇది ఉద్యోగం కాదు, బాధ్యత అని, కేవలం కంపెనీ తీసుకునే నిర్ణయాలు వీళ్లపై ప్రభావం చూపకూడదు అంటాడు. వీరంతా అవుట్‌డేటెడ్ బావ అందుకే తీసేశా అంటుంది జో. ఐదు కూడా చదవని దీప కూడా చెప్పడానికి వచ్చింది అంటుంది. వీరంతకు వీరు రిజైన్ చేస్తే ఏ నియమాలు వర్తించవు. కంపెనీ తీసేస్తే 3 నెలలు టైమ్ ఇవ్వాలి. ఇక వయస్సు 60ఏళ్ల వరకుఉంది. వీటికి లీగల్ సపోర్ట్ ఉంది. ఇక కార్మిక సంఘాలకు ఈ విషయం తెలీదు. తెలిస్తే 10 నలభైమంది అవుతారు. ఆ తర్వాత కంపెనీ బంద్ అవుతుంది.
అలిసి పోయి నీరసం వచ్చి మీరే పడిపోవాలి కానీ, జ్యోత్స్న మాత్రం తలవంచదు బావ అని కారు ఎక్కి వెళ్లిపోతుంది. దీప చూసి కార్తీక్ బాబు జ్యోత్స్న వెనక గేటు వైపు నుంచి వెళ్లిపోతుంది అని చెబుతుంది. ఆ స్ట్రైక్ కంటిన్యూ చేస్తారు. సుమిత్రమ్మ ఇంట్లో దశరథ ఫోన్ మాట్లాడుతుంటాడు. ఇప్పుడే ఈ విషయం నాన్నగారితో మాట్లాడి విషయం చెబుతా అంటాడు.శివన్నారాయణ ఏమైంది రా అంటాడు. మన లీగల్ అడ్వైజర్ చేశారు. చాలా పెద్ద తప్పు జరిగింది నాన్న. ఎంప్లాయీస్‌తో కలిసి కార్తీక్ దీపలు ధర్నా చేస్తున్నారు. మన ఆఫీసులో50 ఏళ్లు పైబడిన వారిని ఏనోటీస్ లేకుండా తీసేశారట. వాళ్లు కార్తీక్ వద్దకు వెళ్లినట్లున్నారు. దీంతో వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎవరు చేశారు అంటుంది సుమిత్రమ్మ, ఇంకెవరు జ్యోత్స్న అంటాడు దశరథ.
అప్పుడే శివన్నారాయణ జో ఎక్కడ ఉంది అంటాడు. ఏంటి తాతా అంటుంది. ఎందుకు చేశావో తరువాత అడుగుతా దీన్ని ఇప్పుడు ఎలా ఆపుతావు? అంటాడు. ఇప్పుడు ఏమైంది తాతా అంటుంది. నోర్మూయ్ జ్యోత్స్న గ్రూప్ అంటే నమ్మకం ఇలా చేస్తావా? అని నిలదీస్తాడు. ఇక బోర్డు మెంబర్స్ కూడా ఫోన్ చేస్తూంటారు.జో పదా.. ఎంప్లాయీస్‌కు సారీ చెప్పు నడువు అంటాడు. మీరే నిర్ణయం తీసుకోమన్నారు కదా.. అంటుంది. నాశనం చేయమనలేదు. దీన్ని మీడియా కవర్ చేయకముందు సాల్వ్ చేయాలి అని దశరథ జో ను తీసుకెళ్తాడు. కాశీకి కూడా ఈ విషయం తెలిసింది. జ్యోత్స్న అక్కయ్య ఎప్పుడూ ఇంతే ఎవరినీ ప్రశాంతంగా ఉండనీయదు అంటాడు. దాసు అప్పుడే రెండు చెంపలు వాయించి బుద్ధి చెబుతా అంటాడు.జ్యోత్స్నను కొట్టడానికి నువ్వు ఎవరు అంటాడు. నా అన్న కూతురు అంటాడు. నిన్ను అస్సలు లెక్కచేయదు అంటాడు కాశి. ఎవ్వరూ ఎక్కడికీ వెళ్లడానికి వీలు లేదు. బావ మాజీ సీఈఓ కాబట్టి వెళ్లాడు అంటాడు కాశి.
మరోవైపు కంపెనీ వద్ద ధర్నా చేస్తూ ఉంటారు. దశరథజోను తీసుకుని వస్తాడు. సీఈఓ డౌన్ డౌన్ అంటూ ధర్నా చేయడం దశరథ చూసి వారి వద్దకు వెళతాడు. కార్తీక్.. అని పిలుస్తాడు. ఏం సార్ కోపంలో కొట్టడానికి వచ్చారా? అంటాడు జరిగిన దానికి క్షమాపణ చెప్పడానికి వచ్చా తెలియకుండా జరిగింది అంటాడు. ప్రభాకర్ గారు ఎంతో నిజాయితీగా పనిచేశారు, వచ్చే నెల కూతురు పెళ్లి 50 ఏళ్లు నిండాయి అి ఉన్న ఫలంగా ఊస్టింగ్ ఇస్తే ఎక్కడకు వెళతారు. వీళ్లంతా కంపెనీపై ఆధారపడి బతుకుతున్నారు అంటాడు కార్తీక్. అందరికీ నా తరఫున సారీ చెబుతున్న, జ్యోత్స్న నువ్వు కూడా సారీ చెప్పు అని గట్టిగా అరుస్తాడు. సారీ ఆల్ ఆఫ్ యూ అంటుంది జో. మీరంతా ఎప్పటిలాగే మీ పోస్టుల్లో చేరవచ్చు. మీకు రావాల్సిన బోనస్, ఇంక్రిమెంట్‌లో ఎలాంటి మార్పులు ఉండవు అంటాడు దశరథ దీంతో అందరూ ఆనందంతో చప్పట్లు కొడతారు. ఇక మీద కూడా జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌కు కలిసి పనిచేద్దాం అంటాడు దశరథ. అందరూ కార్తీక్ సార్ జిందాబాద్ అని నినాదాలు చేస్తుంటారు.
ఇదీ చదవండి: రామలక్ష్మణులు ఫిక్షనల్'.. నేనూ ఒక హిందూవును అంటూ శ్రీముఖి క్షమాపణ వీడియో వైరల్..
ఆగండి, ఆగండి ఈ నినాదాలు నాకు కాదు మీ ఎండీకి చెప్పండి అంటాడు.లేదు సార్ మీరు ఎంతగానో సాయపడ్డారు అంటాడు ప్రభాకర్. ఇక మీదట ఇలాంటివి జరగవని మా మావయ్య చెప్పారు కదా.. మీ పని మీరు చేసుకోండి అంటాడు కార్తీక్ ఇక ఇలాంటి సపోర్ట్ అయిన వైఫ్ మీ లైఫ్‌లో ఉండటం ఎంతో అదృష్టం అంటాడు ప్రభాకర్ దీంతో ముఖం మాడిపోతుంది జో ది.. నువ్వు మార్నింగ్ వచ్చింది ఈ విషయం చెప్పడానికే కదా అంటాడు కార్తీక్‌తో దశరథ. అవును మావయ్య కానీ, తాతయ్య చెప్పనివ్వలేదు కదా.. అంటాడు.
ఇదీ చదవండి: ఈ రాష్ట్రంలో కూడా బీఎస్‌ఎన్‌ఎల్ IFTV సేవలు.. సెటప్ బాక్స్ లేకుండా 500 లైవ్ ఛానల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook