Karthikeya2 Collections: ఆదివారం రచ్చ రేపిన వసూళ్లు.. టోటల్ ఎన్ని కోట్లంటే?
Karthikeya2 9 Days Collections Full Detailed Report: కార్తికేయ 2 సినిమా 9 రోజుల కలెక్షన్స్ రిపోర్టు ఎలా ఉందో చూద్దాం.
Karthikeya2 9 Days Collections Full Detailed Report: 2014లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన కార్తికేయ 2 సినిమా అనేక వాయిదాల తర్వాత ఆగస్టు 13వ తేదీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ సరసన హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించగా వైవా హర్ష, శ్రీనివాసరెడ్డి, తులసి, ఆదిత్య మీనన్, శ్రీధర్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ సినిమా సత్తా చాటుతోంది.
ఇక ఈ సినిమా ఎనిమిదో రోజు కలెక్షన్లతో పోలిస్తే తొమ్మిదో రోజు కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో పెరిగాయి. తొమ్మిదో రోజు ఆదివారం కావడంతో రెండు కోట్ల 42 లక్షలు వసూళ్లు సాధించింది ఈ సినిమా. అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 22 కోట్ల 93 లక్షల షేర్, 36 కోట్ల 55 లక్షల షేర్ వసూళ్లు సాధించింది. తెలుగు సహా మిగతా బాషలలో కలిపి భారతదేశంలో కోటి 95 లక్షల సాధిస్తే కేవలం నార్త్ ఇండియాలోనే హిందీ వర్షన్ ఇప్పటిదాకా ఏడు కోట్ల 20 లక్షలు వసూళ్లు సాధించింది.
ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా నాలుగు కోట్ల 30 లక్షలు వసూలు చేసింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 36 కోట్ల 38 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా 68 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లయింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 23 కోట్ల ఎనిమిది లక్షల లాభాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతానికి దీన్ని ట్రేడ్ వర్గాల వారు ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అని సంబోధిస్తున్నారు. కార్తికేయ 2 సినిమాలో శ్రీకృష్ణుడి ఎపిసోడ్ నార్త్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్పచ్చు.
అందుకే మొదటి రోజు 50 స్క్రీన్ లతో ప్రారంభమైన ఈ సినిమా రాను రాను స్క్రీన్ లను పెంచుకుంటూ వెళ్ళింది. ఇక నార్త్ లో ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉండడంతో అంతకంతకు షోలు కూడా పెంచుతున్నారు మేకర్స్. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ- అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల మీద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా మిగతా అన్ని భాషల్లో విడుదలైంది. కానీ తమిళ వర్షన్ ను థియేటర్లలో విడుదల చేయలేదు. దాన్ని ఓటీటీలో విడుదల చేస్తామని హీరో ప్రకటించారు. అంతేకాక ఈ సినిమా 50 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Megastar Chiranjeevi Upcoming Movies: వరుస సినిమాలు లైన్లో పెట్టిన చిరు.. లిస్టు చూసేద్దామా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి